ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీపీఐ నారాయణ Arrest

ABN, First Publish Date - 2022-06-16T22:21:00+05:30

బాసర ఆర్జీయూకేటీ దగ్గర సీపీఐ నేత నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరుపై నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్: బాసర ఆర్జీయూకేటీ దగ్గర సీపీఐ నేత నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరుపై నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువురాని వ్యక్తిని విద్యాశాఖ మంత్రిని చేశారని దుయ్యబట్టారు. విద్యార్థుల సమస్యలు విద్యామంత్రికి సిల్లీగా కనిపిస్తున్నాయని మండిపడ్డారు. విద్యార్థులను నక్సల్స్‌తో పోల్చడం దుర్మార్గమన్నారు. సమస్యను పరిష్కరించడం చేతగాకే వక్రభాష్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇంతటి దుర్మార్గమైన ప్రభుత్వం ఎక్కడా లేదని నారాయణ మండిపడ్డారు.


బాసరలో ఏర్పాటైన రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ-ట్రిబుల్‌ ఐటీ)లో అదే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన చేస్తున్నారు. విద్యార్థులు 12 రకాల డిమాండ్లను అధికారుల ముందుంచారు. అందులో చాలా వరకు వారికి అన్ని అత్యవసరమని చెప్పవచ్చు. రెగ్యులర్‌ వీసీని నియ మించాలని, క్యాంపస్‌లోనే ఉండాలని, అధ్యాపకుల సంఖ్యను పెంచాలని, ఇన్ఫర్మెషన్‌ టెక్నాలజీ ఆధారిత విద్యను అందించాలని, హాస్టల్‌ తరగతి గదులకు మరమ్మతులు చేయాలని, ల్యాప్‌టాప్‌లు, యూనిఫామ్‌లు, మం చాలు, బెడ్‌లు అందించాలని, నాణ్యమైన భోజనం అందేలా చూడాలని, పీటీలను నియమించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2022-06-16T22:21:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising