ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.40 కోట్లు అప్పు చేసి భార్యాభర్తలు జంప్.. ట్విస్ట్ ఏంటంటే..

ABN, First Publish Date - 2022-08-07T21:31:12+05:30

సుబేదారి పోలీ్‌సస్టేషన్‌ పరిధి వడ్డెపల్లికి చెందిన ఇద్దరు నిందితులు రూ.40 కోట్లు అప్పు చేసి పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న నిందితులను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.40 కోట్లు అప్పు చేసి పారిపోయిన నిందితుల అరెస్టు

నిందితులు ఇద్దరూ భార్యభర్తలు

ఒకరు ప్రభుత్వ ఉద్యోగి


నయీంనగర్‌ (వరంగల్) : సుబేదారి పోలీ్‌సస్టేషన్‌ పరిధి వడ్డెపల్లికి చెందిన ఇద్దరు నిందితులు రూ.40 కోట్లు అప్పు చేసి పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న నిందితులను సుబేదారి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సుబేదారి సీఐ రాఘవేందర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ వడ్డెపల్లిలోని టీచర్స్‌కాలనీ ఫేజ్‌-2కి చెందిన నిందితులు గంగసాని సునీతరెడ్డి, అలియాస్‌ సునీతరాణి(46) - గంగసాని ప్రమోద్‌కుమార్‌రెడ్డి(53)లు భార్యభర్తలు. ప్రమోద్‌కుమార్‌రెడ్డి ఏటూరునాగారంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తుండగా భార్య సునీతరెడ్డి గృహిణిగా ఉంటోంది. ఈ క్రమంలో జనగామ జిల్లా రఘునాథపల్లిలోని నేషనల్‌ హైవే పక్కన విలువైన భూములు కొని వాటిని ప్లాట్లుగా చేసి అమ్మి డబ్బులు సంపాదించాలని నిందితులు అనుకున్నారు. కానీ, వీరి వద్ద అంత డబ్బు లేకపోవడంతో బంధువులు, వారి కాలనీవాసుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. 


ఇలా 2015 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.40 కోట్ల వరకు నిందితులు బాధితుల వద్ద తీసుకున్నారు. బాధితుల వద్ద డబ్బులు తీసుకున్నప్పుడు నిందితులు వారికి బ్యాంకు చెక్కులు, ప్రామిసరీ నోటు రాసి ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. అలాగే తీసుకున్న డబ్బు లకు వడ్డీలు చెల్లిస్తూ వచ్చారు. బాధితులు డబ్బులు ఇవ్వమని నిందితులను నిలదీయగా రెండు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నారని సీఐ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులిద్దరిపై పలు కేసులు నమోదు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుల ఆచూకీ కనిపెట్టి వారిని పట్టుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితులను శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రాఘవేందర్‌ తెలిపారు.

Updated Date - 2022-08-07T21:31:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising