ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చొప్పదండి ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

ABN, First Publish Date - 2022-01-23T01:59:50+05:30

కరీంనగర్‌ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. తనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో కొవిడ్‌ పరీక్ష చేయించుకున్నట్లు శనివారం ఆయన తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చొప్పదండి: కరీంనగర్‌ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. తనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో కొవిడ్‌ పరీక్ష చేయించుకున్నట్లు శనివారం ఆయన తెలిపారు. పాజిటివ్‌ రావడంతో గంగాధరలోని తన నివాసంలో హోం ఐసోలేషన్‌కు వెళ్లినట్లు తెలిపారు. తనను కలిసినవారు పరీక్షలు చేయించుకోవాలని, ప్రజలకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ఫోన్‌ ద్వారా తన దృష్టికి తీసుకురావాలని కోరారు.  


మరోవైపు కరోనా సోకిందని తెలియడంతో ఆందోళనకు గురైన ఒక మహిళ గుండెపోటుకు గురై మృతి చెందింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన అఫ్జల్‌ బీ (66) అనే మహిళ జ్వరం, దమ్ముతో శనివారం ఉదయం వేములవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పాజిటివ్‌ అని తెలియడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురై గుండెపోటుతో  కుప్ప కూలి పోయింది. ఆస్పత్రి వైద్యులు చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతిచెందింది.

Updated Date - 2022-01-23T01:59:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising