ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో ముగిసిన Corona థర్డ్ వేవ్... ఆంక్షలు ఎత్తివేత

ABN, First Publish Date - 2022-02-08T18:59:11+05:30

తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ ముగిసిందని డీహెచ్ శ్రీనివాస్ ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ ముగిసిందని డీహెచ్ శ్రీనివాస్ ప్రకటించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కరోనా మూడు వేవ్‌ల రూపంలో ప్రపంచాన్ని పట్టి పీడించిందన్నారు. తెలంగాణలో కరోనా పాజిటివీటి రేటు రెండు శాతం మాత్రమే ఉందని తెలిపారు. ఫస్ట్ వేవ్ 10 నెలలు, సెకండ్ వేవ్ 6 నెలలు, థర్డ్ వేవ్ మూడు నెలలు మాత్రమే ఉందని అన్నారు. ఎలాంటి ఆంక్షలు అక్కర్లేదన్నారు. కేంద్రం కూడా ఆంక్షలు ఎత్తివేసిందని డీహెచ్ చెప్పారు. 


ఇక వర్క్‌ ఫ్రంహోం అక్కర్లేదన్నారు. ఎన్ని వేరియంట్లు వచ్చినా ఎదుర్కోగలమని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పట్లో కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం లేదన్నారు. వ్యాక్సిన్‌తోనే కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నామని తెలిపారు. కేసులు తగ్గినా ఫీవర్ సర్వే కొనసాగుతుందన్నారు. కరోనాను సీజనల్ ఫ్లూగా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని డీహెచ్‌ శ్రీనివాస్ వెల్లడించారు. 

Updated Date - 2022-02-08T18:59:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising