ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ జైళ్లలో ఖైదీల ములాఖత్‌లు నిలిపివేత

ABN, First Publish Date - 2022-01-19T04:13:22+05:30

తెలంగాణలోని జైళ్లలో ఖైదీల ములాఖత్‌లను జైళ్ల శాఖ నిలిపివేసింది. శుక్రవారం నుంచి ములాఖత్‌లను అధికారులు నిలిపివేయనున్నారు. కరోనా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలోని జైళ్లలో ఖైదీల ములాఖత్‌లను జైళ్ల శాఖ నిలిపివేసింది. శుక్రవారం నుంచి ములాఖత్‌లను అధికారులు నిలిపివేయనున్నారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా జైళ్ల శాఖ అధికారులు నిర్ణయించారు. ఖైదీల ములాఖత్‌ల కోసం ఎవరూ హైదరాబాద్ రావొద్దని స్పష్టం చేసింది. 



కాగా తెలంగాణలో తాజాగా 2,983 కరోనా కేసులు నమోదు కాగా ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకూ మొత్తం 7,14,639 మందికి కరోనా సోకగా 4,062 మరణాలు సంభవించాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే కొత్తగా 1,206 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో జైళ్ల శాఖ అప్రమత్తమైంది. ఖైదీలను కలిసేందుకు శుక్రవారం నుంచి అనుమతి నిరాకరించనుంది. కరోనా కేసులు తగ్గిన తర్వాత ములాఖత్‌లపై నిర్ణయం తీసుకోనుంది. 

Updated Date - 2022-01-19T04:13:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising