ఫ్లెక్సీ తెచ్చిన వివాదం
ABN, First Publish Date - 2022-12-31T00:55:18+05:30
నార్కట్‌పల్లి మండలంలో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు వివాదానికి కారణమైంది. అకారణంగా తమ నాయకుడిని పోలీసులు నిర్బంధించారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే వీరేశం అనుచరులు శుక్రవారం నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషనలో ధర్నా నిర్వహించారు.
ఫ్లెక్సీ తెచ్చిన వివాదం
నార్కట్‌పల్లి మండలంలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే వర్గాలు
నార్కట్‌పల్లి, డిసెంబరు 30: నార్కట్‌పల్లి మండలంలో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు వివాదానికి కారణమైంది. అకారణంగా తమ నాయకుడిని పోలీసులు నిర్బంధించారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే వీరేశం అనుచరులు శుక్రవారం నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషనలో ధర్నా నిర్వహించారు. బీ.వెల్లెంలకు చెందిన నూతనగంటి కృష్ణ ఉదయసముద్రం ప్రాజెక్టు సమీపంలో ఉన్న ఎల్లమ్మ ఆలయం వద్ద ఎల్లమ్మ పం డుగకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆ ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే వీరేశం ఫొ టో తో కూడిన ప్లెక్సీని ఏర్పాటుచేశాడు. ఇంతలోనే నార్కట్‌పల్లి స్టేషననుంచి వచ్చిన ఓ కానిస్టేబుల్ ఎస్ఐ తీసుకురమ్మన్నారని వెంటబెట్టుకుని తీసుకెళ్లాడు. అయితే ఆ సమయంలో ఎస్ఐ స్టేషనలో అందుబాటులో లేకపోవడంతో పండుగ పూర్తయిన తర్వాత మళ్లీ వస్తానని చెప్పినా పోలీసులు పంపలేదు. విషయం తెలుసుకున్న వీరేశం అనుచరులు పోలీస్‌స్టేషనకు చేరుకుని కృష్ణను ఎందుకు తీసుకొచ్చారని నిలదీశారు. కానీ వారి నుంచి సమాధానం రాకపోవడంతో ఆగ్రహించి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా బాధితుడు నూతనగంటి కృష్ణ, వీరేశం అనుచరులు విలేకరులతో మాట్లాడుతూ పం డగ ప్రదేశం వద్ద ఎమ్మెల్యే లింగయ్య ఫొటోతో కూడిన ప్లెక్సీ పెట్టలేదన్న సాకుతోనే స్టేషనకు పిలిపించారని ఆరోపించారు. ధర్నాలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు సట్టు సత్తయ్య, మాజీ జడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, పుల్లెంల అచ్చా లు, సిద్ధగోని స్వామిగౌడ్, బింగి కొండయ్య, రేగట్టె నర్సిరెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై అక్కసుతోనే వీరేశం అనుచరులు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, బీ.వెల్లెంల ఎంపీటీసీ యాదయ్య, ఆర్ఎస్ఎస్ మండల కన్వీనర్ అశోక్‌రెడ్డి అన్నారు. ఎమ్మె ల్యే నివాసంలో వారు విలేకరులతో మాట్లాడారు. కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ఎమ్మెల్యేకు సంబంధం లేదన్నారు. సమావేశంలో ఎంపీటీసీలు పుల్లెంల ము త్తయ్య, మేకల రాజిరెడ్డి, దుబ్బా క శ్రీధర్, క మ్మంపాటి వెం కటయ్య, గోదల వెంకట్‌రెడ్డి, మహేష్ పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే మండలంలోని బీ.వెల్లెంలకు చెందిన నూతనగంటి కృష్ణ పాత కేసుల్లో నేరస్తుడని, అతనిని విచారణ నిమిత్తమే స్టేషనకు పిలిపించామని ఎస్ఐ బీ.రామకృష్ణ తెలిపారు.
Updated Date - 2022-12-31T00:55:19+05:30 IST