ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదాద్రి విద్యుత్కేంద్రాన్ని ఆపే కుట్ర

ABN, First Publish Date - 2022-10-07T07:57:32+05:30

యాదాద్రి విద్యుత్కేంద్రాన్ని ఆపే కుట్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్ని అనుమతులూ తీసుకున్నాకే పనులు

ఎన్జీటీ తీర్పు ఏకపక్షం..

న్యాయపోరాటం చేస్తాం: మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడి

సూర్యాపేట, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్ర నిర్మాణాన్ని ఆపేందుకు కుట్ర జరుగుతోందని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తున్న ఈ కేంద్రానికి పర్యావరణ అనుమతులు రద్దు చేస్తూ ఎన్జీటీ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్జీటీ తీర్పు ఏకపక్షంగా ఉందన్నారు. పర్యావరణ అనుమతులన్నీ తీసుకున్న తర్వాతే నిర్మాణం మొదలు పెట్టామని చెప్పారు. ఎన్జీటీ తీర్పు యా వత్‌ దేశానికే నష్టం కలిగేలా ఉందన్నారు. రూ.వేల కోట్లతో నిర్మాణం చేపట్టాక వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం సరి కాదని అన్నారు. దీని వెనకాల కచ్చితంగా కుట్ర దాగి ఉందని చెప్పారు. గతంలో ఇదే సంస్థ కేసు వేసినప్పుడు ఎన్జీటీ కొట్టివేసిందన్నారు. యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం ఆపాలంటూ వచ్చిన తీర్పుపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అనుకున్న సమయానికల్లా ప్లాంట్‌ నిర్మాణం పూర్తి చేసి విద్యుదుత్పత్తి ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.

Updated Date - 2022-10-07T07:57:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising