ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువ భారత్‌ పార్టీగా కాంగ్రెస్‌ను మార్చాలి

ABN, First Publish Date - 2022-10-07T09:44:40+05:30

యువ భారత్‌ పార్టీగా కాంగ్రెస్‌ను మార్చాలని తాను భావిస్తున్నట్టు ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎవరు గెలిచినా కాంగ్రెస్‌ పార్టీదే విజయం: శశిథరూర్‌  

చెన్నై, అక్టోబరు 6: యువ భారత్‌ పార్టీగా కాంగ్రెస్‌ను మార్చాలని తాను భావిస్తున్నట్టు ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ అన్నారు. సాధారణ కార్యకర్తలు, ముఖ్యంగా యువకుల నుంచి తనకు సానుకూల స్పందన వస్తోందని చెప్పారు. గురువారం చెన్నైలో ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కె.కామరాజ్‌ చిత్రపటాలకు నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాహుల్‌ గాంధీ చేస్తున్న భారత్‌ జోడీ యాత్ర, కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి ఎన్నికలు పార్టీకి ముఖ్యమని, విపక్షాలు చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ‘‘దేశంలో యువత ఎక్కువగా ఉన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలో నాకు యువత మద్దతుగా నిలవడం సంతోషంగా ఉంది. 35 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసున్న వారు దేశ జనాభాలో 65 శాతం ఉన్నారు. మనది యువ భారత్‌. యువ భారత్‌ పార్టీగా కాంగ్రె్‌సను మార్చాలని భావిస్తున్నాను. యువ భారత్‌ ఆశలు, ఆకాంక్షలు, కలలకు ప్రాతినిధ్యం వహించాలని ఆశిస్తున్నా.ప్రస్తుతం యువ భారత్‌కు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముంది. యువతతో పాటు పార్టీలోని సీనియర్లు కూడా నాకు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాను. కేరళలో 91 ఏళ్ల సీనియర్‌ నేత ఫోన్‌ చేశారు. నాలో భవిష్యత్తు కనిపిస్తోందని చెప్పారు.’’ అని శశిథరూర్‌ అన్నారు.

Updated Date - 2022-10-07T09:44:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising