ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: కాంగ్రెస్‌ అవినీతికి పాల్పడి ఉంటే.. దేశంలో ఏదీ మిగిలేది కాదు: పొన్నం

ABN, First Publish Date - 2022-07-30T01:19:30+05:30

దేశాన్ని ఎక్కువకాలం పరిపాలించిన కాంగ్రెస్ (Congress) అవినీతికి పాల్పడి ఉంటే దేశంలో ఏదీ మిగిలేది కాదని కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: దేశాన్ని ఎక్కువకాలం పరిపాలించిన కాంగ్రెస్ (Congress) అవినీతికి పాల్పడి ఉంటే దేశంలో ఏదీ మిగిలేది కాదని కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ (Ponnam Prabhakar) అన్నారు. తిరుమల వేంకటేశ్వరస్వామిని శుక్రవారం ఉదయం దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. దేశంలో కక్షసాధింపు రాజకీయాలు లేకుండా చూడాలని శ్రీవారిని కోరుకున్నట్టు తెలిపారు. సోనియాగాంధీ (Sonia Gandhi) కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయడానికే ఈడీ పేరుతో రోజుల తరబడి విచారణ చేస్తున్నారని విమర్శించారు. ఎక్కడా ఒక్క రూపాయి కూడా నగదు లావాదేవీలు జరక్కపోయినప్పటికీ  కక్షసాధింపుతో వేధిస్తున్నారని దుయ్యబట్టారు. సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా పాలు, పెరుగు, డీజల్‌, పెట్రోల్‌, గ్యాస్‌లపై  జీఎస్టీ పేరుతో జరుగుతున్న దోపిడీని ప్రజలు గుర్తించాలని సూచించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు అందరూ బతకాలని కోరుకునేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం అదాని, అంబాని బతకడానికే పనిచేస్తోందని పొన్నం ప్రభాకర్‌ దుయ్యబట్టారు. 

Updated Date - 2022-07-30T01:19:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising