ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Komatireddy Venkat Reddy: అక్కడే అతడిని లాగిపెట్టి కొట్టాల్సింది: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ABN, First Publish Date - 2022-08-13T00:36:49+05:30

తెలంగాణ కాంగ్రెస్‌కు కోమటిరెడ్డి బ్రదర్స్ (Komatireddy Brothers) తీరు తలనొప్పిగా మారింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) పార్టీకి గుడ్‌బై చెప్పి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌కు కోమటిరెడ్డి బ్రదర్స్ (Komatireddy Brothers) తీరు తలనొప్పిగా మారింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) పార్టీకి గుడ్‌బై చెప్పి తన దారి తాను చూసుకోగా, వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) కాంగ్రెస్‌లోనే (Congress) ఉంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డినే (Revanth Reddy) లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న తీరు అధిష్టానానికి ఇబ్బందిగా మారింది. తాజాగా.. మునుగోడు ఉప ఎన్నిక (Munugodu By Poll) సమావేశానికి తాను వెళ్లడం లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మునుగోడు ఉపఎన్నిక సమావేశానికి సంబంధించిన సమాచారం తనకు లేదని, పిలవని పేరంటానికి తాను వెళ్లనని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుండబద్ధలు కొట్టారు. మునుగోడు గురించి తనకు ఏమీ తెలియదని, తమని అవమానించినవారు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రేపటి కాంగ్రెస్ యాత్రకు తనను ఎవరూ పిలవలేదని ఎంపీ కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.


చండూరు సభలో ఓ పిల్లగానితో తనను తిట్టించారని, అక్కడే అతడిని లాగిపెట్టి కొట్టాల్సిందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాస్తంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన లాంటి సీనియర్‌ను తిట్టిన అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, తిట్టించిన వాళ్లు క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. అప్పుడే మునుగోడులో ప్రచారంపై ఆలోచిస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి స్పష్టం చేశారు.


ఇదిలా ఉండగా.. కాంగ్రెస్‌ నుంచి మునుగోడు (Congress Munugode) బరిలో ముగ్గురు రేసులో ఉన్నట్లు తెలిసింది. అయితే వీళ్లలో ఇప్పటికే కృష్ణారెడ్డి పేరును ఖరారు చేయాలని అనుకున్నా మిగిలిన ఆశావహులు పార్టీ ఫిరాయించే అవకాశం ఉందన్న సమాచారంతో పీసీసీ నేతలు వేచి చూస్తున్నారు. ఒకేసారి అభ్యర్థి పేరు ప్రకటించకుండా సమావేశాలు, మండలాల్లో అభిప్రాయ సేకరణ పేరుతో కొంత ప్రశాంత వాతావరణం నెలకొల్పి నెలాఖరుకు కృష్ణారెడ్డి పేరును ప్రకటించనున్నట్లు సమాచారం. మునుగోడు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 12 సార్లు ఎన్నికలు జరిగితే ఆరుసార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. అంత పట్టున్న నియోజకవర్గం కావడంతో కాంగ్రెస్ పార్టీ ధీమాతో ఉంది.

Updated Date - 2022-08-13T00:36:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising