ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jeevan reddy: కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై జీవన్ రెడ్డి ఆగ్రహం

ABN, First Publish Date - 2022-07-30T19:31:46+05:30

ప్రకృతి వైపరీత్యం వరదలతో రాష్ట్రం అతలాకుతులం అవుతుంటే కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఏంటి అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యం వరదల(Flood)తో రాష్ట్రం (Telangana) అతలాకుతులం అవుతుంటే కేసీఆర్ (KCR) ఢిల్లీ పర్యటన ఏంటి అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(Jeevan reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... వరదలతో లక్షల ఎకరాల పంట నష్టపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు పొందే ప్రయత్నం చేయకుండా కేసీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. గత ఎనిమిది సంవత్సరాల నుండి ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతుంటే పసల్ బీమా లేదు.. ఇన్పుట్ సబ్సిడీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం పొందకపోవడానికి సీఎం కేసీఆర్ అసమర్ధతే కారణమని ఆయన విమర్శించారు.


వరద సహాయం పొందటం తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కు అని స్పష్టం చేశారు. అసమర్ధతకు కేసీఆర్ చిహ్నమని వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొచ్చిన ప్రాజెక్టుని నిలుపుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమయిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project)కు జాతీయ ఆదాయం ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. కమీషన్ల కక్కుర్తికి కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా రాలేదని జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

Updated Date - 2022-07-30T19:31:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising