ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టిఆర్ఎస్‌లో చేరిన కాంగ్ర‌ెస్ నాయకులు

ABN, First Publish Date - 2022-06-30T20:03:00+05:30

జ‌న‌గామజిల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం పాల‌కుర్తి మండ‌లం బ‌మ్మెర గ్రామ కాంగ్రెస్ పార్టీకి చెందిన 6వ వార్డు స‌భ్యురాలు ఒగ్గుల పావ‌ని ప‌ర‌శురాములు, మ‌రికొంద‌రు పార్టీ గ్రామ నాయ‌కులు 50 మంది కార్య‌క‌ర్త‌లు టిఆర్ఎస్ పార్టీలో చేరారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జ‌న‌గామజిల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం పాల‌కుర్తి మండ‌లం బ‌మ్మెర గ్రామ కాంగ్రెస్ పార్టీకి చెందిన 6వ వార్డు స‌భ్యురాలు ఒగ్గుల పావ‌ని ప‌ర‌శురాములు, మ‌రికొంద‌రు పార్టీ గ్రామ నాయ‌కులు 50 మంది కార్య‌క‌ర్త‌లు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు నేతృత్వంలో, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్ స‌మక్షంలో వారు హైద‌రాబాద్ లోని మంత్రుల నివాసంలో గురువారం గులాబీ కుండువాలు క‌ప్పుకున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్రబెల్లి వారికి స్వాగ‌తం ప‌లికారు. పార్టీలో క‌లిసి, అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొనాల‌ని సూచించారు. పార్టీలో కొత్త‌గా చేరిన వారికి కూడా స‌రైన గౌర‌వం ద‌క్కే విధంగా చూస్తామ‌న్నారు.


గ‌త కొంత కాలంగా తాము రాష్ట్రంలో సీఎం కేసిఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్ పార్టీ ప్ర‌భుత్వం, నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుగారి ప‌నితీరు, చేస్త‌న్న అభివృద్ధికి ఆక‌ర్షితుల‌మై టిఆర్ఎస్ లో చేరుతున్నామ‌ని వారు తెలిపారు. పాల‌కుర్తి మండ‌ల పార్టీ అధ్య‌క్షుడు ప‌సునూరి న‌వీన్ ఆధ్వ‌ర్యంలో బ‌మ్మెర గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ యూత్ కార్య‌ద‌ర్శి ఒగ్గుల‌ పోత‌న, సీనియ‌ర్ నాయ‌కులు పందిబోయిన కొముర‌య్య‌, జోగు ర‌వి, గుండె రాములు, బైరు గ‌ట్ట‌య్య‌, ఒగ్గుల ద‌ర్గ‌స్వామి, రొడ్డ సాయితేజ‌, రొడ్డ న‌వీన్ త‌దిత‌రులు టిఆర్ఎస్ లో చేరిన వారిలో ఉన్నారు. 

Updated Date - 2022-06-30T20:03:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising