ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అగ్నిపథ్’ మంటలు చల్లారలేదు: VH

ABN, First Publish Date - 2022-06-20T19:17:19+05:30

‘‘అగ్నిపథ్’’ మంటలు చల్లారలేదని.. దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయని మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంత రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ‘‘అగ్నిపథ్’’ మంటలు చల్లారలేదని.. దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయని మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంత రావు(V.Hanumanth rao) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ...ఆర్మీ అధికారులు మాటలు అగ్నికి ఆజ్యం పోసినట్లుందని మండిపడ్డారు. పార్లమెంట్‌లో చర్చలు ఉండవని.. ప్రతిపక్షంతో చర్చలు లేవని అన్నారు. ప్రధాని మోదీ(Modi).. కార్పొరేట్ కంపెనీల చేతిలో బందీ అయ్యారని ఆరోపించారు. నరేంద్రమోదీ.. ఇకనైనా మన్మోహన్ సింగ్ పాలనను గుర్తు చేసుకోవాలని హితవుపలికారు. ఆఖరికి సైన్యాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సేవ చేసే వారి విషయంలో అవమానకరంగా వ్యవహరిస్తోందన్నారు. సైనికుల పట్ల అవమానకరంగా మాట్లాడిన బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్ వర్గిపై చర్యలు తీసుకోవాలని వీహెచ్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-06-20T19:17:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising