ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అగ్నిపథ్’ పేరుతో నాలుగేళ్లు సర్వీస్ పెట్టడం దారుణం: VH

ABN, First Publish Date - 2022-06-17T18:23:48+05:30

సైనికుల నియమకాలలో ‘‘అగ్నిపథ్’’ పేరుతో నాలుగేళ్లు సర్వీస్ పెట్టడం దారుణమని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత్ రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సైనికుల నియమకాలలో ‘‘అగ్నిపథ్’’ పేరుతో నాలుగేళ్లు సర్వీస్ పెట్టడం దారుణమని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత్ రావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... నాలుగేళ్ల తర్వాత వారి జీవితాలకు భరోసా ఇవ్వడం లేదని మండిపడ్డారు. గతంలో 15 నుంచి 20 సంవత్సరాలు సర్వీస్‌తో పాటు అన్ని సౌకర్యాలు ఇచ్చేవారని గుర్తుచేశారు. సైనికులకు పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుందని ఇలా చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధపడ్డ వారికి బీజేపీ ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు.


డిఫెన్స్ దగ్గర నిధులు లేవంటే ప్రపంచం ముందు దేశం పరువు ఏమి కావాలని నిలదీశారు. ఇలాంటి విధానాలు బీజేపీ మానుకోవాలని హితవుపలికారు. నేడు దేశం అగ్నిపథ్‌తో అగ్ని గుండంలా మారిందన్నారు. మహమ్మద్ ప్రవక్త పైన బీజేపీ నాయకులు చేసిన ప్రకటనలతో ప్రపంచం ముందు భారత్ పరువు పోయిందని తెలిపారు. ఇవన్నీ దేశ ప్రతిష్టను మంట గలుపుతున్నాయన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన ప్రధాని మోదీకి పాలించే నైతిక హక్కు లేదని వీహెచ్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-06-17T18:23:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising