ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KCRపై అవినీతిని వెలికి తీసి ప్రధాని చిత్తశుద్ధి చాటుకోవాలి: Ponnala

ABN, First Publish Date - 2022-05-27T19:26:51+05:30

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ పొరుగు రాష్ట్రానికి తప్పించుకు వెళ్లడం దుర్మార్గమని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra modi) హైదరాబాద్‌కు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ పొరుగు రాష్ట్రానికి తప్పించుకు వెళ్లడం దుర్మార్గమని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య(Ponnala laxmaiah) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... నిన్నటి రోజు ప్రజాస్వామ్యంలో చీకటి రోజన్నారు. స్వయంగా ప్రధాని నోటి వెంట కేసీఆర్‌పై అవినీతి వ్యాఖ్యలు చేశారని తెలిపారు. మాటలకు పరిమితం కాకుండా సీఎం కేసీఆర్‌పై అవినీతిని వెలికి తీసి ప్రధాని చిత్తశుద్ధి చాటుకోవాలని సవాల్ విసిరారు. ప్రధాని దగ్గర కేసీఆర్ అవినీతిపై ఆధారాలు ఉంటే రాష్ట్రపతి పాలన పెట్టి కేసీఆర్‌పై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతి సొమ్ముతో దేశ పర్యటన చేస్తున్న చిల్లర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ సమస్యలపై మాట్లాడకుండా కేవలం ప్రధాని మోదీ కేవలం రాజకీయం మాట్లాడడం దుర్మార్గమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజలు చెంపదెబ్బ కొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-27T19:26:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising