ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరి ధాన్యం కొనుగోళ్లపై గందరగోళం: రేవంత్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-03-04T02:19:44+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన రాహిత్యం వల్లే రాష్ట్రంలో వరి కొనుగోళ్లపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన రాహిత్యం వల్లే రాష్ట్రంలో వరి కొనుగోళ్లపై గందరగోళం ఏర్పడిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డ్రామాలు ఆడుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈనెల 5న సివిల్ సప్లయీస్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు. యాసంగి వడ్ల కొనుగోళ్లలో తగిన చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు. రైతుల ఉద్యమం వేళ సీఎం కేసీఆర్‌కి తికాయత్ గుర్తుకు రాలేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ ఢిల్లీ టూర్‌ అని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాలపై కేసీఆర్‌కు ఎలాంటి ఆలోచన లేదన్నారు. 


మంత్రి హత్యకు కుట్ర జరిగితే సీఎం సమీక్ష చేయరా అని ఆయన ప్రశ్నించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై ఎలక్షన్ అఫిడవిట్ వ్యవహారం విచారణలో ఉండగానే ఇవన్నీ జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నేతలు డీకే అరుణ, జితేందర్‌రెడ్డి ఇళ్లపై గూండాల దాడి ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-03-04T02:19:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising