ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా.. జీహెచ్ఎంసీ ముందస్తు చర్యలేవీ : విజయశాంతి

ABN, First Publish Date - 2022-09-28T02:29:47+05:30

Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. లోతట్లు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాలాలు, డ్రైనేజీలు ఉప్పొంగాయి. రోడ్డన్నీ చెరువులను తలపించాయి. జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, కూకట్ పల్లి, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. ‘నగరంలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. లోతట్లు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాలాలు, డ్రైనేజీలు ఉప్పొంగాయి. రోడ్డన్నీ చెరువులను తలపించాయి. జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, కూకట్ పల్లి, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. ‘నగరంలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించినా.. జీహెచ్ఎంసీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని బీజేపీ నాయకురాలు విజయశాంతి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. విజయశాంతి పోస్టు యథాతథంగా..


జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులోకి కూడా..

‘‘హైదరాబాద్ లో వర్షం పడితే చాలు రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయి. సోమవారం నాడు కురిసిన వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇదే కాకుండా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.  నాలాలు, డ్రైనేజీలు ఉప్పొంగాయి. ఇండ్లు, షాపుల్లోకి వరద చేరింది. కొన్ని చోట్ల సరుకులు కొట్టుకుపోయాయి. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులోకి వరద నీళ్లు వచ్చాయి. హైదరాబాద్ కలెక్టరేట్ లోని ఓ ఫ్లోర్ లో నీళ్లు చేరాయి. నీళ్లు నిలిచిన ప్రాంతాల్లో సహాయక బృందాలు అసలే కనిపించలేదు. బేగంపేట్, మాసబ్ ట్యాంక్, బంజారాహి ల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, కూకట్ పల్లి, ఎల్బీనగర్, వనస్థలిపురం, కోరి, లక్ష్మీకాపూల్, మెహిదీపట్నం, నాంపల్లి. మలక్ పేట్ తదితర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. నగరంలో మరో రెండ్రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయినా జీహెచ్ఎంసీ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవడం లేదు. భారీ వర్షం కురవడంతో జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వరద సమస్యలు, చెట్ల కొమ్మలు, విద్యుత్, డ్రైనేజీలు వాటి గురించి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి.  ఏం కేసీఆర్ నువ్వు చేస్తానన్న డల్లాస్ నగరం ఇదేనా..? ఇంకెన్ని రోజులు ఈ ఒక దంపుడు ఉపన్యాసాలు. తొందరలోనే కేసీఆర్ సర్కార్ కు తెలంగాణ ప్రజానీకమే తగిన బుద్ధి చెప్పడం ఖాయం’’ అని విజయశాంతి పేర్కొన్నారు. 


Updated Date - 2022-09-28T02:29:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising