ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మణుగూరు హెవీవాటర్‌ ప్లాంట్‌లో ఓ-18 ఉత్పత్తి ప్రారంభం

ABN, First Publish Date - 2022-01-19T09:34:10+05:30

ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్లాంట్‌ అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మణుగూరు భార జల కర్మాగారం మరో మైలురాయిని అధిగమించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశంలో తొలిసారి.. 26న జాతికి అంకితం చేయనున్న ప్రధాని

అశ్వాపురం, జనవరి 18: ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్లాంట్‌ అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మణుగూరు భార జల కర్మాగారం మరో మైలురాయిని అధిగమించింది. జీవరసాయన చర్యల్లో వినియోగించే హెచ్‌-2 ఓ-18 ఉత్పత్తి మంగళవారం మణుగూరు హెవీవాటర్‌ ప్లాంట్‌లో ప్రారంభమైంది. దేశంలోనే ఓ-18 ఉత్పత్తి ఈ ప్లాంట్‌లోనే జరగడం గమనార్హం. ఈ ప్లాంట్‌ను సోమవారం భారత అణుశక్తి విభాగం చైర్మన్‌ కె.ఎన్‌.వ్యాస్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. కాగా 26న జరగనున్న రిపబ్లిక్‌ డే ఉత్సవా ల్లో ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి ఈ ప్లాంట్‌ను జాతికి అంకితం ఇవ్వనున్న ట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఓ-18 ఐసోటోప్‌ ద్వారా మానవ శరీరంలోని ట్యూమర్లు, కేన్సర్‌ ప్రేరేపిత కారకాలు, డిమెన్షియావంటి వ్యాధుల మూలాలను ఖచ్చితంగా నిర్ధారించేందుకు ఉపయోగించనున్నారు. ఇప్పటివరకు అమెరికా, చైనా వంటి దేశాలు మాత్రమే ఓ-18ని ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. 

Updated Date - 2022-01-19T09:34:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising