ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

100శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2022-01-21T05:52:10+05:30

100శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీ్‌షరావు

హనుమకొండ రూరల్‌, జనవరి 20 : కొవిడ్‌ నియంత్రణకు ఇంటింటి జ్వర సర్వే నిర్వహించి 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీ్‌షరావు అన్నారు. గురువారం పంచాయతీరాజ్‌ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో కొవిడ్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీ్‌షరావు మాట్లాడుతూ.. ప్రతీ రోజు 25 ఇళ్లలో ఇంటింటి సర్వే నిర్వహించి కొవిడ్‌ లక్షణాలతో ఎవరైనా బాధపడే వారుంటే ఐసోలేషన్‌ కిట్‌ను అందజేయాలన్నారు. కొవిడ్‌ నియంత్రణకు  వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. కొవిడ్‌ నియంత్రణలో భాగంగా గ్రామానికి ఒక నోడల్‌ ఆఫీసర్‌ను నియమించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. కొవిడ్‌తో మరణించిన వారికి ప్రభుత్వం అందించే ఎక్స్‌గ్రేషియా త్వరగా మంజూరు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, డీఎంహెచ్‌వో లలితాదేవి, డీఆర్‌డీవో శ్రీనివా్‌సకుమార్‌, డీపీవో జగదీశ్వర్‌, డాక్టర్‌ కృష్ణారావు, మునిసిపల్‌ సూపర్‌వైజర్స్‌ సాంబయ్య, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-01-21T05:52:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising