ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yadadri : గర్భగుడి దివ్య విమానానికి కేసీఆర్ ఎంత బంగారం ఇచ్చారంటే..

ABN, First Publish Date - 2022-09-30T19:52:19+05:30

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshminarasimhaswamy) ఆలయానికి సీఎం కేసీఆర్ (CM KCR), శోభ దంపతులు చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Lakshminarasimhaswamy) ఆలయానికి సీఎం కేసీఆర్ (CM KCR), శోభ దంపతులు చేరుకున్నారు. కేసీఆర్ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కాగా.. స్వామి వారి గర్భగుడి దివ్య విమానానికి బంగారు తాపడం కోసం 125 కిలోల బంగారం పట్టనుంది. దీనికోసం దాతలు సైతం భాగస్వామ్యం కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. తన కుటుంబం తరుఫున కేసీఆర్ కిలో 16 తులాల బంగారాన్ని ప్రకటించారు. నేడు దేవస్థానంలో ముఖ్యమంత్రి దంపతులు తమ మనవడు హిమాన్షు చేతుల మీదుగా ఆ బంగారాన్ని అందజేశారు. కాగా.. ఇప్పటికే దాతల నుంచి సుమారు 6 కిలోల 617 గ్రాముల బంగారం, రూ. 19 కోట్ల 38 లక్షల 17వేల నగదు సమకూరింది. మొత్తం 125 కిలోల బంగారు తాపడం కోసం రూ.65 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. అయితే సుమారు రూ.22 కోట్ల మేర మాత్రమే సమకూరినట్టు సమాచారం. మొత్తం సమకూరాక రిజర్వు బ్యాంకు నుంచి స్వచ్ఛమైన బంగారాన్ని దేవస్థానం కొనుగోలు చేయనున్నట్టు తెలుస్తోంది. సీఎం వెంట మంత్రులు జగదీష్ రెడ్డి (Jagadish Reddy), ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran Reddy), ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy), తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav), పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

Updated Date - 2022-09-30T19:52:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising