ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొమురవెల్లి మల్లన్న‌కు గోదావరి జలాలతో జలాభిషేకం

ABN, First Publish Date - 2022-02-23T22:30:36+05:30

ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్నను దర్శించుకొని స్వామివారికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్నను దర్శించుకొని స్వామివారికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మల్లన్నసాగర్ గోదావరి జలాలతో మల్లన్నకు జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రి హరీష్‌రావు, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, తదితరులు ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి కొమురవెల్లి మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును సీఎం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ బహిరంగ సభలో మాట్లాడుతూ మల్లన్నసాగర్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం కొమురవెల్లిలోని స్వామివారిని దర్శించుకున్నారు. 


కొమురవెల్లి మల్లన్న స్వామి పేరు మీదుగా తుక్కాపూర్‌లో 50య టీఎంసీల సామర్థ్యంతో మల్లన్న సాగర్‌ ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 15.70 లక్షల ఎకరాలకు సాగు నీరు, హైదరాబాద్‌ నగరానికి తాగునీరు అందించేలా రూపొందించారు. 

Updated Date - 2022-02-23T22:30:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising