ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News.. జనగామ జిల్లా: సీఎం కేసీఆర్ పర్యటనలో అపశృతి

ABN, First Publish Date - 2022-10-01T16:42:34+05:30

జనగామ జిల్లా: సీఎం కేసీఆర్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ జిల్లా (Janagama Dist.): సీఎం కేసీఆర్ (CM KCR) పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి కాన్వాయ్ (Convoy) నుంచి ఓ మహిళా కానిస్టేబుల్ (woman constable) జారి పడిపోయింది. అయినా కాన్వాయ్ ఆపకుండా ముందుకు వెళ్లిపోయింది. ఈ ఘటనలో మహిళా కానిస్టేబుల్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. 


శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన సీఎం కేసీఆర్ జనగామ జిల్లా, పెంబర్తి కళాతోరణం చేరుకున్నారు. ఇక్కడ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, స్థానిక నేతలు ముఖ్యమంత్రికి శాలువ కప్పి స్వాగతం పలికారు. అనంతరం కాన్వాయ్ కదులుతుండగా మహిళా కానిస్టేబుల్‌ జారి పడిపోయింది. అయినా కాన్వాయ్ ఆపకుండా వెళ్లిపోయింది. సహా పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.


కాగా హనుమకొండ జిల్లా దామెర క్రాస్‌రోడ్డు, జాతీయ రహదారి-163లో నూతనంగా ఏర్పాటైన ప్రతిమ రిలీఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌, ఆస్పత్రిని  శనివారం  సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి ఇక్కడ మూడు గంటల పాటు గడుపుతారు. మధ్యాహ్నం భోజనం అనంతరం 2 గంటలకు హైదరాబాద్‌కు బయలేరతారు.

Updated Date - 2022-10-01T16:42:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising