ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM KCR: కేసీఆర్‌కు నిరసన సెగలు

ABN, First Publish Date - 2022-09-06T01:23:16+05:30

నిజామాబాద్‌ జిల్లాలో సీఎం కేసీఆర్‌ (CM KCR)కు నిరసన సెగ తగిలింది. నూతన కలెక్టరేట్‌, టీఆర్‌ఎస్‌ (TRS) పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవ సందర్భంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: నిజామాబాద్‌ జిల్లాలో సీఎం కేసీఆర్‌ (CM KCR)కు నిరసన సెగ తగిలింది. నూతన కలెక్టరేట్‌, టీఆర్‌ఎస్‌ (TRS) పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవ సందర్భంగా సోమవారం సీఎం కేసీఆర్‌ జిల్లాలో పర్యటించగా.. పలువురు ప్రతిపక్ష, విద్యార్థి సంఘ నాయకులు సీఎం కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ప్రత్యేక హెలిప్యాడ్‌లో పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకున్న కేసీఆర్‌ ప్రత్యేక కాన్వాయ్‌ ద్వారా నూతన టీఆర్‌ఎస్‌ భవనాన్ని ప్రారంభించేందుకు వెళ్తుండగా పీవైఎల్‌, పీడీఎస్‌యూ (PLY PDSU) నాయకులు పోలీసుల వలయాన్ని చేదించుకుని ఒక్కసారిగా దూసుకొచ్చారు. సీఎం కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేసీఆర్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నంలో లాఠీచార్జ్‌ చేశారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. సీఎం కేసీఆర్‌ పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం నూతన కలెక్టరేట్‌ భవనం వైపు వెళ్తుండగా.. కంఠేశ్వర్‌ బైపాస్‌ వద్ద కాంగ్రెస్‌ నాయకులు కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు కాంగ్రెస్‌ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2022-09-06T01:23:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising