ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాని మోదీపై విరుచుకుపడిన సీఎం కేసీఆర్

ABN, First Publish Date - 2022-04-28T02:08:37+05:30

ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ మాటల పదును పెంచారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించారు. ఈ ప్లీనరీలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ మాటల పదును పెంచారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించారు. ఈ ప్లీనరీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ప్రధాని మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ డ్రామా కాన్ఫరెన్స్ పెట్టారని మండిపడ్డారు. కరోనాపై కాన్ఫరెన్స్ పెట్టి, పెట్రోల్‌పై పన్ను తగ్గించాలంటారా? అని ప్రశ్నించారు. ఏ నోటితో తగ్గించాలని ప్రధాని అడుగుతారు అని నిలదీశారు. ఇదేనా ప్రధాని మాట్లాడాల్సిన విధానం అని వ్యాఖ్యానించారు. పన్నులు పెంచిన పాపాలభైరవులు కేంద్రంలోని పెద్దలేనని సీఎం కేసీఆర్ చెప్పారు.


ఈ దేశానికి ప్రధాని మోదీ ఏం చేశారని, ఏ రంగంలో అభివృద్ధి సాధించారో చెప్పాలని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఇస్లామిక్ దేశాల్లో ఆలయాలు కడుతున్నారని చెప్పారు. మనదేశంలో అశాంతిని చెలరేగేలా రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు. ఉద్వేగం, విద్వేషం రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఎక్కడ ఎన్నికలు వస్తే కత్తులు పట్టుకుని ఊరేగుతున్నాతారా అని నిలదీశారు. మనిషికోసం మతమా?.. మతం కోసం మనిషా..? అని ప్రశ్నించారు. 


కన్సల్టెంట్‌ను కూడా పెట్టుకున్నామని.. మళ్లీ టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని... అనుమానాలొద్దని పార్టీ నేతలు, కార్యకర్తలకు కేసీఆర్ సూచించారు. విదేశాల్లో సైతం మన గుడులున్నాయని, అక్కడున్న వాళ్లు ప్రగతిపూర్వకంగా ఆలోచిస్తున్నారని కేసీఆర్ తెలిపారు. ఒక్క కాల్ చేస్తే రూ.600 కోట్లు విరాళాలు వస్తాయన్నారు.  అబద్దాలు, అసత్యాల పునాదుల మీద ఓట్ల కోసం వేట జరుగుతుందని..అందరం కలిసి కట్టుగా ఎదుర్కోకపోతే, చాలా సమస్యలు తప్పవని కేసీఆర్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-04-28T02:08:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising