ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నల్గొండ అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ ఆరా

ABN, First Publish Date - 2022-04-29T01:27:01+05:30

నల్గొండ జిల్లాలో అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ ఆరాతీశారు. గతంలో ఆదేశించిన మేరకు ఏయే పనులు ఎంత వరకు వచ్చాని ఆరా తీశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నల్గొండ జిల్లాలో అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ ఆరాతీశారు. గతంలో ఆదేశించిన మేరకు ఏయే పనులు ఎంత వరకు వచ్చాని ఆరా తీశారు. నల్గొండ పట్టణానికి మణిహారం లాంటి పానగల్లు ఉదయ సముద్రం ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్ పనులను అద్భుతంగా చేపట్టడానికి అవసరమైన ప్రణాళిక రూపొందించి పనులు నిర్వహించాలని కలెక్టర్ జీవన్ పాటిల్ ను ఆదేశించారు. గరువారం నార్కట్ పల్లిలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సీఎం కేసీఆర్ నల్గొండ అభివ`ద్ధిపై సమావేశం నిర్వహించారు. అత్యాధునిక హంగులతో, ఆహ్లాదకరమైన రీతిలో గజ్వేల్ మహతి తరహాలో నల్గొండ కళాభారతి సాంస్క`తిక కేంద్రాన్ని 2వేల మంది సామర్ధ్యంతో తీర్చిదిద్దాలని సూచించారు.


పట్టణంలో అర్భన్ పార్కులను సుందరీకరించాలని నల్లగొండ చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు వచ్చి కుటుంబ సభ్యులు, పిల్లలతో ఆహ్లాదంగా గడిపేలా సౌకర్యాలు ఏర్పాటుచేయాలని సీఎం అన్నారు. ఇందుకు సంబంధించి ప్రముఖ ఆర్కిటెక్ట్ ల నుంచి డిజైన్లు తెప్పించుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ఇప్పటికే ప్రారంభమైన వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. మార్కెట్ కు వచ్చిన చిన్నపిల్లల భద్రత పాటు, వాళ్లుఆడుకోవడానికి పచ్చని పార్కు, ఆటస్థలంతో కూడిన చిల్డ్రన్ కేజ్ ను ఏర్పాటు చేయాలన్నారు.


నల్గొండ పట్టణంలో జరుగుతున్న, జరగాల్సిన అభివ`ద్ధి పనుల డిజైన్లను సీఎం కేసీఆర్ పరిశీలించారు. వివరాలు , ఫోటోల ద్వారా పనుల పురోగతిని కలెక్టర్ జివన్ పాటిల్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కమిషనర్ రమణాచారి కేసీఆర్ కు వివరించారు. నల్గొండ టౌన్ లో స్థలాలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అర్బన్ పార్కులను ఏర్పాటుచేయాలన్నారు. నగరంలో పచ్చదనం, నర్సరీల గురించి సీఎం ఆరా తీశారు. విరివిగా మొక్కలు నాటడంతో పాటు, రహదారుల విస్తరణ, తదితర కారణాలతో తొలగిస్తున్న పెద్దపెద్ద చెట్లను ట్రాన్స్ లొకేషన్ చేస్తున్నామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సీఎంకు వివరించారు. 

Updated Date - 2022-04-29T01:27:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising