ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీజేఐ ఎన్వీ రమణను అడిగిన వెంటనే స్పందించారు: కేసీఆర్

ABN, First Publish Date - 2022-06-03T00:10:49+05:30

అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణతో కలిసి తెలంగాణలోని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణతో కలిసి తెలంగాణలోని 33 జిల్లాల కోర్టులను కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఎన్వీ రమణ గతంలో ఇదే హైకోర్టు‎లో పని చేశారన్నారు. హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని ఎన్వీరమణను కోరారని... వెంటనే స్పందించారని తెలిపారు. హైదరాబాద్ పాత జిల్లా మినహాయిస్తే మిగిలిన అన్ని జిల్లాలో కోర్టులు వస్తున్నాయన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జిల్లా కోర్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. ములుగు, భూపాలపల్లి రెండు పెద్ద జిల్లాలని.. పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా సత్ఫాలితాలు వస్తాయని తెలిపారు. 


‘‘జిల్లా కోర్టులు ఏర్పాటు కావాలని చీఫ్ జస్టిస్‎ను అడగగానే ఒప్పుకున్నారు. జిల్లా కోర్టులో అన్ని పోస్టులను భర్తీ చేస్తాం. సిటీ సివిల్ కోర్టు, రంగారెడ్డి కోర్టులు విభజించాలి. జుడీషియల్ డిపార్ట్‎మెంట్‎లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది.’’ అని కేసీఆర్ తెలిపారు. 


Updated Date - 2022-06-03T00:10:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising