ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రగతి భవన్ లో జాతీయ జెండాను ఎగుర వేసిన సీఎం కేసీఆర్

ABN, First Publish Date - 2022-01-26T20:02:13+05:30

భారత రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ప్రగతి భవన్ లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: భారత రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ప్రగతి భవన్ లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. సీఎం జాతీయ జెండా ను ఆవిష్కరించారు. అనంతరం సీఎం కేసీఆర్ తో కలిసి మంత్రి జాతీయ జెండాకు వందనం చేశారు. అంతకుముందు గాంధీజీ, అంబేద్కర్ చిత్ర పటాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఉన్న సైనిక అమర వీరుల స్థూపం వద్ద సీఎం శ్రద్ధాంజలి ఘటించారు. 


ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం, ప్రజలే పరిపాలించుకునే సమాఖ్య స్ఫూర్తితో పటిష్టమైన, విశిష్టమైన రాజ్యాంగం మనదని అన్నారు. సీఎం కెసిఆర్ రాష్ట్రాన్ని ప్రజాస్వామ్య బద్ధంగా, సమాఖ్య స్ఫూర్తి ని చాటుతూ పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేశారని, రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపి గుణాత్మక ప్రగతిని సాధించారని తెలిపారు. ప్రజలందరికీ మంత్రి ఎర్రబెల్లి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2022-01-26T20:02:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising