ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దమ్ముంటే నన్ను జైల్లో వేయండి: కేసీఆర్

ABN, First Publish Date - 2022-02-14T00:49:57+05:30

దమ్ము ఉంటే తనను జైల్లో వేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‎కు సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. బండిసంజయ్‌నే జైల్లో వేస్తామని కేసీఆర్ హెచ్చరించారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దమ్ము ఉంటే తనను జైల్లో వేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‎కు సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. బండిసంజయ్‌నే జైల్లో వేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. జైలు అంటే దొంగలు భయమని.. తమకేం భయలేదన్నారు. మోడీ సర్కార్‌లో 33 మంది బ్యాంక్‌లను మోసం చేసి విదేశాల్లో  తలదాచుకుంటున్నారని మండిపడ్డారు. ఇది మోదీ ఆధ్వర్యంలో దేశం సాదించిన ఘనత అని ఎద్దేవా చేశారు. ఇందులో సగం కంటే ఎక్కువ మంది మోదీకి స్నేహితులేనని,  గుజరాతిలేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ మాస్ట్ గో ఫ్రమ్ ది కంట్రీ నినాదం ఇప్పుడు అవసరమన్నారు. ‘‘కనీస సంస్కారం లేని పార్టీ బీజేపీ. ప్రధాని మోదీ. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు బీజేపీకి ప్రజల్లో నమ్మకం ఉండేది. కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్,  రాష్ట్రాల్లో గెలవకపోయిన అధికారం చేలాయిస్తున్నారు. మహారాష్ట్రలో బీజేపీ చేసిన రాజకీయాలపై చర్చ పెడదాం.’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. 



Updated Date - 2022-02-14T00:49:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising