ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డల్లా.. డొల్ల.. గుండు సున్నా.. : సీఎం కేసీఆర్

ABN, First Publish Date - 2022-02-01T23:32:56+05:30

కేంద్ర ప్రవేశ పెట్టిన బడ్జెట్ డల్ల.. డొల్ల.. గుండు సున్నా అని తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ డల్లా.. డొల్ల.. గుండు సున్నా అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కేంద్రబడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలసిందే. ఈ బడ్జెట్‌పై స్పందించిన కేసీఆర్... కేంద్రప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఉపాధిహామీ పథకానికి 30వేలకు పైగా కోత పెట్టారని మండిపడ్డారు. వ్యవసాయం, ఎరువులు, నరేగా సబ్సీడీ తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘బీజేపీ ప్రభుత్వం ఎవరి కోసం ఉంది?. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి మెదడు ఉన్నట్టా? లేనట్టా?. కేంద్ర ప్రభుత్వ పాలసీ వెరీ బ్యాడ్ పద్ధతి అవలంబిస్తోంది. 38 కోట్ల జనాభా ఉండే ఎస్సీ, ఎస్టీలకు 15వేల కోట్లు. తెలంగాణలో దళితుల కోసం 33వేల కోట్లు కేటాయించాం. బీజేపీకి దళితులు- గిరిజనుల పట్ల శిత్తశుద్ధి బడ్జెట్ చుస్తే అర్థం అవుతుంది. రైతులకు ప్రధాని క్షమాపణ చెప్పారు. కానీ ఇవ్వాళ వ్యవసాయ రంగానికి సరైన కేటాయింపులు లేవు. యూరియాపై సబ్సిడీ 12వేలు, ఇతర ఎరువులపై 20వేలకు పైగా తగ్గించారు..’’ అని కేసీఆర్ తెలిపారు. 



కేంద్రం నిస్సిగ్గుగా ఎల్‌ఐసీని అమ్ముతోందని, ఎందుకు అమ్ముతోందని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. నష్టం వస్తే అమ్మాలి కాని లాభాల్లో నడుస్తున్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారని  నిలదీశారు. బ్యాంకులను ముంచిన వారంతా హ్యాపీగా విదేశాల్లో ఉన్నారని తెలిపారు. ‘‘ ప్రపంచ హంగర్‌ ఇండెక్స్‌లో 101 స్థానంలో ఉన్నాం.అడ్డగోలుగా మాపై మాట్లాడుతున్నారు.. కూకటివెళ్లతో పెకిలిస్తాం. వెరీ షార్ట్‌ సైటెడ్‌ మన ప్రధాని. ఈ ప్రభుత్వం ఎవరికోసం ఉన్నట్టు. ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ను అడ్డుకునేందుకు మోదీ కుట్రచేశారు. ఈ కేంద్రాన్ని అహ్మదాబాద్‌కు తరలించాలని చూశారు. సంకుచితమైన బుద్ధికలిగిన కేంద్ర ప్రభుత్వం ఉన్నందుకు సిగ్గుపడుతున్నాం. కేంద్రం చెప్పేదంతా అబద్ధమే. క్రిప్టో కరెన్సీని ఎవరైనా ఒప్పుకుంటారా?.’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. 




Updated Date - 2022-02-01T23:32:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising