ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోల్డ్ మెడల్స్ సాధించిన నిఖత్ జరీన్, ఈషాసింగ్ కు నగదు బహుమతి:Kcr నిర్ణయం

ABN, First Publish Date - 2022-06-02T00:13:03+05:30

అంతర్జాతీయ క్రీడల్లో ఘన విజయాన్ని సాధించి తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన తెలంగాణ బిడ్డలను సమున్నతంగా గౌరవించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నిర్ణయించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అంతర్జాతీయ క్రీడల్లో ఘన విజయాన్ని సాధించి తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన తెలంగాణ బిడ్డలను సమున్నతంగా గౌరవించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఈ మేరకు ఇటీవల టర్కీలో జరిగిన అంతర్జాతీయ మహిళా బాక్సింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్ కు, జర్మనీలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన ఈషా సింగ్ కు ఒక్కొక్కరికి 2కోట్ల రూపాయల బహుమతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 


ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగదు బహుమతితో పాటు వీరికి బంజారాహిల్స్ లో కానీ, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో నివాసయోగ్యమైన ఇంటి స్థలాన్ని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విధంగా పద్మశ్రీ కిన్నెరమెట్ల మొగిలయ్యకు రూ.1కోటి నగదు పురస్కారాన్ని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మొగిలయ్య కోరుకున్నట్టుగా బిఎన్ రెడ్డి నగర్ కాలనీలో నివాసయోగ్యమైన ఇంటి స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

Updated Date - 2022-06-02T00:13:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising