ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

floods: ఏటూరునాగారం బయల్దేరిన కేసీఆర్

ABN, First Publish Date - 2022-07-17T14:47:43+05:30

సీఎం కేసీఆర్ (CM KCR) ఏటూరునాగారం బయల్దేరారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రోడ్డుమార్గంలో సీఎం ఏటూరునాగారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హన్మకొండ: సీఎం కేసీఆర్ (CM KCR) ఏటూరునాగారం బయల్దేరారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రోడ్డుమార్గంలో సీఎం ఏటూరునాగారం (Eturnagaram) వెళ్లారు. తాడ్వాయి-ఏటూరునాగారం మధ్య భారీగా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ఏటూరునాగారంలో వరద బాధితులతో ఆయన మాట్లాడనున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ ఏటూరునాగారానికి రావలసిందిగా సీఎం ఆదేశించినట్టు సమాచారం. ఏటూరునాగారంతో పాటు ఏజెన్సీ ప్రాంతాలన్ని వరదతాకిడికి తీవ్రంగా గురైన దృష్ట్యా వరద బాధితులను ఆదుకుకునేందుకు సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అక్కడే ఉండాలని ఆదేశించారు. ఇందుకు కొందరు ఎమ్మెల్యేలు తటపటాయించారు. 


వర్షాలవల్ల తమ నియోజకవర్గాలోని ప్రాంతాలు కూడా దెబ్బతిన్నాయని, తమ అవసరం ఇక్కడ ఉందని చెప్పబోగా ఇక్కడ కంటే అక్కడే మీ అవసరం ఎక్కువగా ఉందని.. అందరూ ఏటూరునాగారం రావాలసిందేనని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులంతా ఏటూరునాగారంలో ఉండే అవకాశం ఉంది. వారం రోజులుగా విస్తృతంగా కురిసిన వర్షాల వల్ల రాష్ట్రంలో సంభవించిన వరద బీభత్సాన్ని క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించే కార్యక్రమానికి కేసీఆర్‌ హనుమకొండ నుంచి ప్రారంభించారు. మూడు రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలో వరద పీడిత ప్రాంతాలను సీఎం ఏరియల్‌ సర్వే ద్వారా తిలకించి నష్టాన్ని అంచనా వేయనున్నారు.

Updated Date - 2022-07-17T14:47:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising