ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాహుల్ బజాజ్ మరణం పట్ల కేసీఆర్ సంతాపం

ABN, First Publish Date - 2022-02-13T01:55:16+05:30

ప్రముఖ జాతీయ వ్యాపర వాణిజ్యవేత్త, రాజ్యసభ మాజీ సభ్యులు, పద్మభూషణ్ రాహుల్ బజాజ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రముఖ జాతీయ వ్యాపార వాణిజ్యవేత్త, రాజ్యసభ మాజీ సభ్యులు, పద్మభూషణ్ రాహుల్ బజాజ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. ఆటోమొబైల్ రంగ అభివృద్దికి  దేశ వ్యాపర వాణిజ్య రంగానికి రాహుల్ బజాజ్ చేసిన కృషి గొప్పదన్నారు. బజాజ్ స్కూటర్ వంటి ఉత్పత్తులు దేశ ప్రజా జీవనంలో భాగస్వామ్యం అయ్యాయన్నారు. ‘‘ హమారా బజాజ్’’ అనేది వ్యాపార వాణిజ్య నినాదమే అయినప్పటికీ, అది భారత జాతిని, ఉత్పత్తి రంగంలో స్వీయ అస్తిత్వ విధానం దిశగా చైతన్య పరిచిందని సీఎం అన్నారు.


రాహుల్ బజాజ్ సామాజిక బాధ్యత కలిగిన జాతీయ వాద వ్యాపర వేత్తగా సీఎం పేర్కొన్నారు. రాహుల్ బజాజ్ మరణం, దేశీయ పారిశ్రామిక రంగానికి తీరని లోటని సీఎం విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

Updated Date - 2022-02-13T01:55:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising