ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రమంత్రులు తిట్టిపోయిన మర్నాడే అవార్డులు ఇస్తారు : కేసీఆర్

ABN, First Publish Date - 2022-10-01T17:55:28+05:30

వరంగల్లో సీఎం కేసీఆర్ (CM KCR) పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన హన్మకొండలో ప్రతిమ వైద్య కళాశాలను ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్ : వరంగల్లో సీఎం కేసీఆర్ (CM KCR) పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన హన్మకొండలో ప్రతిమ వైద్య కళాశాలను ప్రారంభించారు. అనేక రంగాల్లో దేశంలోనే తెలంగాణ (Telangana)దే ప్రథమ స్థానమని కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు తిట్టిపోయిన మర్నాడే అవార్డులు ఇస్తారన్నారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపించిందన్నారు. రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజ్ (Medical college)ని కూడా ఇవ్వలేదన్నారు. వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలోనే వైద్య విద్యకు సరిపడా సీట్లు ఉన్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.


12 కొత్త వైద్య కళాశాలలు తెచ్చుకున్నామన్నారు. జిల్లాకో వైద్య కళాశాలను తీసుకువస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. 2004కు ముందు 2080 మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో 6,700 సీట్లు ఉన్నాయన్నారు. సహనంతో అందరినీ కలుపుకునే దేశం భారత్ అని కేసీఆర్ పేర్కొన్నారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. వైద్య విద్యతో పాటు విద్యార్థులు సామాజిక అవగాహనను పెంచుకోవాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-10-01T17:55:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising