ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ జీవన వైవిద్యానికి బోనాలు ప్రతీక: కేసీఆర్

ABN, First Publish Date - 2022-07-01T02:01:09+05:30

తెలంగాణ ప్రత్యేకతను చాటే బోనాల పండుగ తెలంగాణ జీవన వైవిద్యానికి, పర్యావరణ, ప్రక`తి ఆరాధనకు ప్రతీకంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేకతను చాటే బోనాల పండుగ తెలంగాణ జీవన వైవిద్యానికి, పర్యావరణ,ప్రకృతి ఆరాధనకు ప్రతీకంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. రాష్ట్రపండుగైన బోనాల పండగ ప్రారంభమైన సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పణతో గురువారం నుంచి తెలంగాణలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయని అన్నారు. ప్రతి ఏటా ఆషాఢం, శ్రావణ మాసాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకునే బోనాల పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ సబ్బండ వర్గాల సాంప్రదాయాలకు, రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవాన్నిస్తున్నదని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు అందించాలని అమ్మవారిని సీఎం కేసీఆర్ ప్రార్ధించారు. 

Updated Date - 2022-07-01T02:01:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising