ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Green fund ప్రపంచానికి గ్రీన్ ఫండ్ కాన్సెప్ట్ పరిచయం చేసింది తెలంగాణ:Kcr

ABN, First Publish Date - 2022-05-19T01:14:17+05:30

మొట్టమొదటిసారిగా ప్రపంచానికి గ్రీన్ ఫండ్ కాన్సెప్ట్ ను పరిచయంచేసింది తెలంగాణ రాష్ట్రమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు(kcr) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మొట్టమొదటిసారిగా ప్రపంచానికి గ్రీన్ ఫండ్ కాన్సెప్ట్ ను పరిచయంచేసింది తెలంగాణ రాష్ట్రమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు(kcr) అన్నారు. బుధవారం ప్రగతి భవన్ లో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు తమ వేతనంలో 100 నుంచి 500 రూపాయల వరకు ప్రతినెలా కంట్రిబ్యూట్ చేసే విధానం, అడ్మిషన్లు, రిజిస్ర్టేషన్ల ఫీజులో కొంత గ్రీన్ ఫండ్ వసూలు చేస్తున్నామని అన్నారు. స్ధానిక సంస్థల నిధుల్లో 10శాతం బడ్జెట్ ను హరితహారానికి కేటాయించడం తప్పని సరి అన్నారు.


ఈ నిబంధనలను ఖచ్చితంగా అమలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో భాగంగా జరుగుతున్న అన్ని పనులను మంత్రులు, చీఫ్ సెక్రటరీలు, జడ్పీఛైర్మన్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ లు, లోకల్ బాడీ కలెక్టర్లు, డీపీవోలు, నిరంతరం తనిఖీలు చేసి ఎవరి పరిధిలో వారు రెగ్యులర్ గా మానిటర్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. 

Updated Date - 2022-05-19T01:14:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising