ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: సీజేఐ రమణకు కవిత లేఖ

ABN, First Publish Date - 2022-08-19T23:28:40+05:30

సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ (CJI Justice NV Ramana)కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ (CJI Justice NV Ramana)కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) లేఖ రాశారు. బిల్కిస్ బానో దోషుల విడుదలలో జోక్యం చేసుకోవాలని కోరారు. అత్యాచారం వంటి నేరాలు మన సామాజిక స్పృహను కుదిపేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. రేపిస్ట్లు స్వాతంత్ర్య దినోత్సవం నాడు బయటికి రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతారని తెలిపారు. దోషుల విడుదల నిర్ణయం వెనక్కు తీసుకునేలా.. చర్యలు చేపట్టాలని లేఖలో సీజేఐని కోరారు. ప్రభుత్వాలు రిమిషన్ అధికారాలను ఏకపక్షంగా ఉపయోగించవద్దని, సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పులో స్పష్టం చేసిందని కవిత లేఖలో పేర్కొన్నారు. 


గుజరాత్ బిల్కిస్ బానో (Bilkis Bano) కేసులో నిందితుల (Accused) విడుదల (Release)పై మంత్రి కేటీఆర్ (Minister KTR) ట్విట్టర్ వేదికగా స్పందించారు. అత్యాచార నిందితులను శిక్షించే చట్టాలను సవరించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన అత్యాచారం కేసులో తెలంగాణ ప్రభుత్వం  ఏం చేస్తోందని జరిగిన ట్రోలింగ్‌పై మంత్రి సమాధానం ఇచ్చారు. రేపిస్టులను వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపామని తెలిపారు. 45 రోజుల తర్వాత వారికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందన్నారు. రేపిస్టులను చట్ట ప్రకారం శిక్షించే వరకు పోరాడాలన్నారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్,  ఐపీసీ, సీఆర్పీసీలోని లొసుగుల వల్ల  రేపిస్టులు తప్పించుకుంటున్నారన్నారు. ఏ రేపిస్ట్‌కూ.. బెయిల్ రాకుండా ఉండాలన్నారు. అత్యాచార కేసుల్లో దోషిగా తేలినప్పుడు వారు మరణించే వరకు జైలులోనే ఉంచాలని మంత్రి కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా దేశమంతా స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకొంటున్న వేళ బిల్కిస్‌ బానో గ్యాంగ్‌ రేప్‌ కేసులో దోషులను పంద్రాగస్టు నాడే గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. 

Updated Date - 2022-08-19T23:28:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising