ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రిస్మస్‌ కానుకలొచ్చేశాయ్‌

ABN, First Publish Date - 2022-12-15T00:37:53+05:30

క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకొని ప్రభు త్వం అందించే క్రిస్మస్‌ కానుకలు ఉమ్మడి జిల్లాకు చేరాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోకజవర్గాల్లోని 12వేల మంది క్రైస్తవులకు కానుకలను అందించనున్నారు. పురుషులకు ప్యాంట్‌, షర్ట్‌, మహిళలకు చీర, జాకెట్‌ ముక్క, యువతకు డ్రెస్‌ మెటీరియల్‌ కానుకగా ఇవ్వనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

12వేల మందికి దుస్తులు, క్రిస్మస్‌ విందు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి పంపిణీ

భువనగిరి టౌన్‌, డిసెంబరు 14: క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకొని ప్రభు త్వం అందించే క్రిస్మస్‌ కానుకలు ఉమ్మడి జిల్లాకు చేరాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోకజవర్గాల్లోని 12వేల మంది క్రైస్తవులకు కానుకలను అందించనున్నారు. పురుషులకు ప్యాంట్‌, షర్ట్‌, మహిళలకు చీర, జాకెట్‌ ముక్క, యువతకు డ్రెస్‌ మెటీరియల్‌ కానుకగా ఇవ్వనున్నారు. అలాగే క్రైస్తవులందరికీ క్రిస్మస్‌ విందుకోసం ఒక్కో నియోజకవర్గానికి రూ.2లక్షల చొప్పున రూ.24లక్షలను ప్రభుత్వం మం జూరు చేసింది. దీంతో దుస్తుల పంపిణీ, క్రిస్మస్‌ విందుల కోసం అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. తహసీల్దార్లు క్రైస్తవ సంఘాలతో కలిసి దుస్తుల పంపిణీ, విందు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని 12వేల మంది క్రైస్తవులకు దుస్తులతోపాటు ప్రభుత్వం క్రిస్మస్‌ విందు ఇవ్వనుంది. ఈమేరకు భువనగిరిలో 15న క్రిస్మస్‌ దుస్తుల పంపిణీ, 19న క్రిస్మస్‌ విందును ఏర్పాటు చేశారు. ఆలేరులో 20న ఒకే రోజున దుస్తుల పంపిణీ, విందును చేపట్టారు. అలాగే ఉమ్మడి జిల్లాలోని మిగతా 10 నియోజకవర్గాల్లో కూడా నిర్ధేశించిన తేదీల్లో క్రిస్మస్‌ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సమాజంలోని అన్నివర్గాలు పండుగలను సంతోషంగా నిర్వహిం చేందుకు ప్రభుత్వం ప్రతీఏటా బతుకమ్మ చీరలు, రంజాన్‌, క్రిస్మ్‌సకు దుస్తులు, విందులు ఏర్పాటు చేస్తోందని ఉమ్మడి జిల్లా కలెక్టర్లు పమేలాసత్పథి, వినయ్‌ కృష్ణారెడ్డి, పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ పేర్కొన్నారు.

Updated Date - 2022-12-15T00:37:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising