ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chikoti Praveen: చినజీయర్‌స్వామిని గురువుగా భావిస్తా: చికోటి ప్రవీణ్‌

ABN, First Publish Date - 2022-08-17T21:57:59+05:30

చినజీయర్‌స్వామి (Chinna Jeeyar Swamy)ని తాను గురువుగా భావిస్తానని చికోటి ప్రవీణ్‌ (Chikoti Praveen) తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: చినజీయర్‌స్వామి (Chinna Jeeyar Swamy)ని తాను గురువుగా భావిస్తానని చికోటి ప్రవీణ్‌ (Chikoti Praveen) తెలిపారు. విదేశాల నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని చెప్పారు. తనకు ప్రాణహాని ఉందని, తన ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించారని చెప్పారు. క్యాసినో కేసు విచారణలో ఈడీకి రాజకీయ నేతల పేర్లు చెప్పాలని, ఫోన్‌లో బెదరిస్తున్నారని వెల్లడించారు. హిట్‌మెన్ అనే విదేశీ యాప్‌లో సుపారీ ఇచ్చామని బెదిరిస్తున్నారని, భద్రత కోసం హైకోర్టు (High Court)లో పిటిషన్ వేశానని ప్రకటించారు. క్యాసినో లీగల్‌ అని తాను ఏ తప్పు చేయలేదన్నారు. ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పానని, హవాలా లావాదేవీలతో తనకు సంబంధం లేదన్నారు. సినీ ప్రముఖుల ప్రమోషన్లకు నిబంధనల ప్రకారమే చెల్లింపులు జరిపామని పేర్కొన్నారు. రాజకీయపార్టీల నేతలతో తనకు పరిచయాలున్నాయని తెలిపారు. బెదిరింపు కాల్స్‌పై తాను టీడీపీ (TDP)ని బ్లేమ్‌ చేయలేనని చెప్పారు. అన్ని అనుమతులతో ఫాంహౌజ్‌లో జంతువులను పెంచుతున్నామని తెలిపారు. ఈడీ విచారణకు ఎప్పుడు పిలిచినా వెళ్లేందుకు సిద్ధమని పేర్కొన్నారు. 


గతంలో చిన్నజీయర్ స్వామికి కేసినో కంపు అంటిన విషయం తెలిసిందే. గుడివాడ కేసినో (gudivada casino) నిర్వాహకుడితో స్వామీజీ అంటు కట్టారు. ప్రవీణ్ చికోటికి స్వామి ఆశీస్సులు అందించారు. చిన్న జీయర్‌ను ఎక్కించుకుని స్వయంగా ప్రవీణ్ చికోటీ కారు నడిపారు. అప్పట్లో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసాంఘిక శక్తులకు మంగళాసనాలా?, ఇదేనా చిన్న జీయర్ సమతావాదం? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో కేసినో నిర్వహించారు. ఈ కేసినో‌లో పేకాట, గుండాట, రికార్డింగ్ డ్యాన్సులతో పాటు పలు జూదాలకు చెందిన ఆటలను కూడా నిర్వహించారు. ఇది బయటకు పొక్కడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రతిపక్షాలు దుమ్మేత్తిపోశాయి. ఇప్పుడు ఈ మరక చిన్న జీయర్ స్వామికి కూడా అంటింది. క్యాసినో నిర్వహించిన  ప్రవీణ్ చికోటీ.. స్వామీజీతో కనిపించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2022-08-17T21:57:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising