ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనా రుణయా్‌పల కేసు..రూ.86.65 కోట్ల కుడోస్‌ ఫైనాన్స్‌ నిధుల జప్తు

ABN, First Publish Date - 2022-07-07T09:45:36+05:30

చైనా రుణయా్‌పల కేసులో కుడోస్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్వె్‌స్టమెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో పాటు మరికొన్ని సంస్థల పేమెంట్‌ గేట్‌ వేల్లోని రూ.86.65 కోట్ల నిధులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) బుధవారం జప్తు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాలుగు సంస్థలకు రూ.940.47 కోట్ల లాభం

హైదరాబాద్‌, జూలై 6(ఆంధ్రజ్యోతి): చైనా రుణయా్‌పల కేసులో కుడోస్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్వె్‌స్టమెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో పాటు మరికొన్ని సంస్థల పేమెంట్‌ గేట్‌ వేల్లోని రూ.86.65 కోట్ల నిధులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) బుధవారం జప్తు చేసింది. వాటిలో ఏస్‌మనీ ఇండియా లిమిటెడ్‌, రైనో ఫైనాన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, పయనీర్‌ ఫైనాన్సియల్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తదితర సంస్థల నిధులున్నాయి. అవన్నీ చైనా కంపెనీల నిధులతో అక్రమంగా మైక్రో రుణాలను అందజేశాయి. ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా అధిక వడ్డీ వసూలు చేసి రూ.940.47 కోట్ల మేర లాభాలు గడించాయి. ఆ నిధులను 155 బ్యాంక్‌ ఖాతాలకు మళ్లించాయి. అందులో తొలుత జనవరిలో రూ.72.32 కోట్లు జప్తు చేయగా.. తాజాగా మరో రూ.86.65 కోట్లను ఈడీ అటాచ్‌ చేసింది. చైనా రుణయా్‌పల ద్వారా జరిగిన నిధుల మళ్లింపుపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో భారీగా మనీలాండరింగ్‌ జరిగినట్లు బయటికి రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. కుడోస్‌, ఏస్‌మనీ, రైనో, పయనీర్‌ సంస్థలు విదేశాలకు చెందిన ఫిన్‌టెక్‌ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని.. తమ పేమెంట్‌ గేట్‌వేల ద్వారా రుణాలు మంజూరు చేసినట్లు దర్యాప్తులో తేలింది. 

Updated Date - 2022-07-07T09:45:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising