ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిర్చి రైతు కన్నెర్ర

ABN, First Publish Date - 2022-01-25T07:16:55+05:30

వ్యాపారులు కుమ్ముక్కై మిర్చి ధరలు అమాంతం తగ్గించారని ఆరోపిస్తూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర తగ్గించారని వరంగల్‌లో ఆందోళన 


వరంగల్‌టౌన్‌, జనవరి 24: వ్యాపారులు కుమ్ముక్కై మిర్చి ధరలు అమాంతం తగ్గించారని ఆరోపిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌లో సోమవారం తేజ రకం మిర్చి క్వింటాలుకు రూ.17,200 గరిష్ట ధర పలికింది. తర్వాత కొద్ది సేపటికి వ్యాపారులు రూ.14,000కు మించి ధర పెట్టకపోవటంతో రైతులు ఆందోళనకు దిగారు. ధర తగ్గించటంపై వ్యాపారులను ప్రశ్నించగా మిర్చి నాణ్యతను బట్టి ఇంతకంటే ఎక్కువ రాదని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పెద్ద ఎత్తున మిర్చి యార్డు కార్యాలయానికి వచ్చి అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలో పర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కొనుగోలు చేసి లారీలో నింపిన మిర్చి బస్తాలను కిందపడేశారు. పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.


పోలీసులు, అధికారులు, మార్కెట్‌ చైర్‌ పర్సన్‌, పాలకవర్గ సభ్యులు రైతులతో మాట్లాడి వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం బీజేపీ నాయకులు వచ్చి మద్దతు తెలపడంతో రైతులు మరోసారి ఆందోళనకు దిగారు. పలుమార్లు చర్చలు జరిపినా కొలి క్కి రాకపోవడంతో మార్కెట్‌ కమిటీ మార్కెట్‌కు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. 


Updated Date - 2022-01-25T07:16:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising