ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనుమ రోజు చికెన్ ప్రియులకు షాక్ ఇచ్చిన వ్యాపారులు

ABN, First Publish Date - 2022-01-16T20:36:36+05:30

గత కొంత కాలంగా చికెన్ ధరలు సాధారణ ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయి. రిటైల్ షాపుల్లో కిలో చికెన్ ధర 200 నుంచి 220 రూపాయలకు అమ్మకాలు చేశారు. భోగి, సంక్రాంతి పండగలు శుక్ర, శనివారాల్లో రావడంతో చాలా మంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గత కొంత కాలంగా చికెన్ ధరలు సాధారణ ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయి. రిటైల్ షాపుల్లో కిలో చికెన్ ధర 200 నుంచి 220 రూపాయలకు అమ్మకాలు చేశారు. భోగి, సంక్రాంతి పండగలు శుక్ర, శనివారాల్లో రావడంతో చాలా మంది నాన్ వెజ్ కు దూరంగానే ఉన్నారు. సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ పండగ రోజున అత్యధిక శాతం నాన్ వెజ్ ప్రియులు చికెన్ కోసం ఎగబడతారు. ఆదివారం కనుమ రోజున ఉదయం 6గంటల నుంచే చికెన్ షాపులు కిటకిటలాడారు. అయితే చాలా మంది వినియోగ దారులు చికెన్ ధర చూసి షాక్ అయ్యారు. కేవలం శనివారం కిలో చికెన్ 220 రూపాయలు పలుకగా ఆదివారం నాటికి కిలో 250 రూపాయలకు పెంచేశారు. దీంతో చాలా మంది కొనుగోలు ఇదేం ఖర్మరా బాబూ అంటూ గొనుక్కుంటూనే చికెన్ కొనుగోలు చేశారు. 


వ్యాపారులుకూడా చాలా తెలివిగా కనుమ రోజున ధర పెంచి అమ్మకాలు చేశారు. నాన్ వెజ్ ప్రియుల్లో అత్యధిక శాతం చికెన్ కే ప్రాధాన్యత ఇస్తారు. చికెన్ తో రక రకాల ఐటమ్స్ తయారు చేసుకుంటారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే సాధారణ రోజుల్లో లక్ష కేజీల చికెన్ వినియోగం అవుతంటే పండగల సందర్భంగా దాదాపు రెండు లక్షల చికెన్ వినియోగం అవుతున్నట్టు వ్యాపారులు తెలిపారు. అయితే పండగ పూట తప్పని సరిగా నాన్ వెజ్ తినే వారు ధరలు పెరిగినా కొనుగోలు చేశారు. 

Updated Date - 2022-01-16T20:36:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising