ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుల అదుపులో చర్ల దళ కమాండర్‌?

ABN, First Publish Date - 2022-09-08T10:10:09+05:30

మావోయిస్టు పార్టీ కొత్తగూడెం జిల్లా చర్ల దళ కమాండర్‌ రజిత అలియాస్‌ మడకం కోసిని పోలీసులు బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మరో నలుగురు దళ సభ్యులు
  • కోర్టులో హజరుపరచకుంటే మూల్యం తప్పదు: ఆజాద్‌ లేఖ
  • అపాయం తలపెట్టొద్దు: పౌరహక్కుల సంఘం

చర్ల, హైదరాబాద్‌, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ కొత్తగూడెం జిల్లా చర్ల దళ కమాండర్‌ రజిత అలియాస్‌ మడకం కోసిని పోలీసులు బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెతో పా టు మరో నలుగురు దళ సభ్యులను తెలంగా ణ, ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో అదుపులోకి తీసుకున్న ట్టు సమాచారం అందుతోంది. దుమ్ముగూడెం మండలం ములకనాపల్లికి చెందిన రజిత మా వోయిస్టు పార్టీ చర్ల దళకమాండర్‌గా పని చే స్తున్నారు. ఆమె మావోయి స్టు పార్టీ తెలంగాణ రాష్ట్రనాయకుడు దామోదర్‌ భార్య.  కాగా కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు జిల్లా డివిజన్‌ కమిటీ స భ్యుడు ఆజాద్‌ పేరిట ఓ లేఖ విడుదలైంది. బుధవారం తెల్లవారుజామున తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు మూకుమ్మడిగా డోకుపాడు, కుర్నపల్లి, కూనవాయి గ్రా మంపై దాడిచేసి అనారోగ్యంతో ఉన్న రజితను,  మరో నలుగురు దళ సభ్యులను అదుపులోకి తీసుకున్నారని, పోలీసులు తక్షణమే వా రిని కోర్టులో హాజరు పరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అరెస్టు చేసిన వారికి ప్రాణ హాని తలపెడితే ప్రభుత్వం, పోలీసులు బాధ్యత వహించాల్సి ఉంటుందని, అధికార పార్టీ నేతలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నామ ని లేఖలో పేర్కొన్నారు.  తమ కూతురు మడకం కోసిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఆమె తల్లిదండ్రులు మారయ్య, పోజ్జమ్మ, తమ్ముడు సోను తెలిపారు.  రజితకు ఎలాంటి అపాయం తలపెట్టకుండా కోర్టులో హాజరుపరచాలంటూ పౌర హక్కుల సంఘం తెలంగాణ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌, ప్రధాన కార్యదర్శి నారాయణ రావు డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-09-08T10:10:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising