ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌కి చంద్రబాబు

ABN, First Publish Date - 2022-12-16T03:20:52+05:30

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌.చంద్రబాబు శుక్రవారం గచ్చిబౌలిలోని ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌ (ఐఎ్‌సబీ)ను సందర్శించనున్నారు. ఐఎ్‌సబీ ద్విదశాబ్ది ముగింపు ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్విదశాబ్ది ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా..

ప్రఖ్యాత సంస్థ హైదరాబాద్‌కు రావడంలో నాడు కీలకపాత్ర

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌.చంద్రబాబు శుక్రవారం గచ్చిబౌలిలోని ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌ (ఐఎ్‌సబీ)ను సందర్శించనున్నారు. ఐఎ్‌సబీ ద్విదశాబ్ది ముగింపు ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సంస్థ ఏర్పాటులో చంద్రబాబు కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగిన సమయంలో 1999లో ఐఎ్‌సబీకి శంకుస్ఠాపన జరగ్గా, 2001లో ప్రారంభమైంది. వాస్తవానికి 1996 ప్రాంతంలో అగ్రశ్రేణి పారిశ్రామిక వేత్తలు, విద్యావేత్తలు ఒక ప్రపంచ స్థాయి బిజినెస్‌ స్కూల్‌ స్థాపనకు పూనుకున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వార్టన్‌ స్కూల్‌, కెల్లాంగ్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌తో సహా లండన్‌ బిజినెస్‌ స్కూల్‌ కలిసి ఐఎ్‌సబీ స్థాపన కోసం అకడమిక్‌ కమిటీగా ఏర్పడ్డాయి. ఐఎ్‌సబీ స్థాపనకు ఈ కమిటీ వివిధ రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నదనే విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు.. హైదరాబాద్‌లో స్థాపించాలని కోరారు. కానీ అప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాలు ఈ బిజినెస్‌ స్కూల్‌ను తమ దగ్గరే స్థాపించాలని కోరడంతో పాటు విరివిగా రాయితీలు కూడా ప్రకటించాయి. దీంతో కమిటీ తమ దృష్టిలో హైదరాబాద్‌లో బిజినెస్‌ స్కూల్‌ స్థాపించే ఉద్దేశమే లేదని తెలియజేసింది. ఐఎ్‌సబీ స్థాపనకు బెంగళూరు, చెన్నై, ముంబై నగరాలను పరిశీలిస్తున్నామని చంద్రబాబుకు కమిటీ తెలియజేసింది. అయినా పట్టువదలని చంద్రబాబు బిజినెస్‌ స్కూల్‌ ప్రతినిధి బృందాన్ని ఒకసారి హైదరాబాద్‌కు రావాలని, తర్వాత ఇక్కడ స్థాపిస్థారా? లేదా? నిర్ణయించుకోవచ్చని అన్నారు. హైదరాబాద్‌ వచ్చిన ఆ బృందానికి స్వాగతం పలకడానికి ఎయిర్‌పోర్టుకు మంత్రుల బృందాన్ని పంపారు. ఇంటికొచ్చిన బృందంలోని సభ్యులకు చంద్రబాబే స్వయంగా అల్పాహారాన్ని వడ్డించారు. ఆ తర్వాత ఒక పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా హైదరాబాద్‌లో బిజినెస్‌ స్కూల్‌ ఏర్పాటు ఆవశ్యకతను, ప్రయోజనాలను వారికి వివరించారు. మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ రాయితీలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనుకున్న సమయానికి సంస్థను ఆరంభించే బాధ్యత తనదేనని ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. చంద్రబాబు పట్టుదల, హైదరాబాద్‌లో పెడితే ఎలా ఉంటుందన్న దానిపై ఇచ్చిన ప్రజంటేషన్‌లు చూసిన ప్రతినిధి బృందం చివరకు బిజినెస్‌ స్కూల్‌ను ఇక్కడే స్థాపించేందుకు అంగీకారం తెలిపింది. అంతేకాదు... వెనువెంటనే దీనికి భూమిని కేటాయించడం, సత్వరమే నిర్మాణం పూర్తయ్యేలా చంద్రబాబు తన వంతు పాత్ర పోషించారు. అలా త్వరితగతిన పూర్తి చేసుకుని హైదరాబాద్‌లో 2001 డిసెంబరు 2న నాటి ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి, చంద్రబాబులు ఐఎ్‌సబీని ఆరంభించారు.

Updated Date - 2022-12-16T03:21:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising