భార్యపై అనుమానంతోనే భర్త ఈ దారుణాలకు పాల్పడ్డాడు: చందానగర్ సీఐ
ABN, First Publish Date - 2022-10-17T17:51:43+05:30
చందానగర్‌లోని రాజీవ్ గృహకల్పలో నాగరాజు సుజాత దంపతులు గత ఏడు ఏళ్లుగా పాపిరెడ్డి కాలనీలో ఉంటున్నారని
Hyderabad : చందానగర్‌లోని రాజీవ్ గృహకల్పలో నాగరాజు సుజాత దంపతులు గత ఏడు ఏళ్లుగా పాపిరెడ్డి కాలనీలో ఉంటున్నారని ఇన్‌స్పెక్టర్ క్యాస్ట్రో పేర్కొన్నారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. భార్యపై అనుమానంతోనే నాగరాజు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. స్థానికులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారన్నారు. ముందుగా నాగరాజు భార్యా పిల్లలను హత్య చేశాడని తెలిపారు. కత్తెరతో ఆ ముగ్గురిపై దాడి చేసి హతమార్చిన గుర్తులు ఉన్నాయన్నారు. అనంతరం తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. నాగరాజు సుజాత శుక్రవారం రోజు చివరిసారిగా కనిపించారని స్థానికులు చెప్పారన్నారు. ఇంట్లో నుంచి దుర్గంధం వస్తూ ఉండటంతో స్థానికులు గమనించి తమకు సమాచారం ఇచ్చారన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
నాగరాజు సైకోలాగా ప్రవర్తించేవాడు..
సుజాత టైలరింగ్ చేయడంతో పాటు ఫైనాన్స్ ఇస్తూ ఉండేదని స్థానికులు ఏబీఎన్‌కు తెలిపారు. నిత్యం ఆమెను నాగరాజు వేధింపులకు గురి చేసేవాడని వెల్లడించారు. భర్త వేధింపుల గురించి తమకు చెప్పుకుని బాధ పడేదన్నారు. గత శుక్రవారం చివరిసారిగా సుజాతను చూశామన్నారు. నాగరాజు సైకో లాగా ప్రవర్తించే వాడని వెల్లడించారు. నాగరాజు వేధింపులు శృతిమించి ఇలా దారుణ హత్యలకు పాల్పడుతాడు అని అనుకోలేదని స్థానికులు వెల్లడించారు.
Updated Date - 2022-10-17T17:51:43+05:30 IST