ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేద విద్యార్ధులకు నాణ్యమైన విద్యనందిస్తున్న Cm Kcr

ABN, First Publish Date - 2022-06-29T21:46:03+05:30

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యా, మౌలిక వసతులకల్పనే లక్ష్యంగా పని చేస్తున్నారని తెలంగాణ విద్యా,మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి(ravula sridhar reddy) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యా, మౌలిక వసతులకల్పనే లక్ష్యంగా పని చేస్తున్నారని తెలంగాణ విద్యా,మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి(ravula sridhar reddy) అన్నారు. ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మన బడి(ma vooru mana badi) కార్యక్రమం ద్వారా కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయని అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మన ఊరు మనబడి, మనబస్తీ మనబడి ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనుల్నిఆయన పరిశీలించారు. కామారెడ్డిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రూఫ్ వాటర్ ప్రూఫింగ్ పనుల్ని పరిశీలించిన అనంతరం నిజామాబాద్ పట్టణం, ముబారక్ నగర్ లోని MPPS, దుబ్బాలోని ఉన్నత పాఠశాల, నందిగుట్ట నాగారంలో 20 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన మైనారిటీ గురుకుల పాఠశాల భవనంని సందర్శించి పనుల్ని పరిశీలించారు. 


ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల ఆర్థికంగా ఎన్నోఒడిదుడుకులు ఎదురైనప్పటికి కేసీఆర్ విద్యకు ప్రాధాన్యత కల్పిస్తూ రాష్ట్రంలోని 26వేల పాఠశాలలో 7238 కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టారన్నారు.అందులో భాగంగానే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎంపిక చేయబడిన 758 పాఠశాల్లో 354 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థికి కార్పొరేట్ స్థాయి విద్య,మౌలిక వసతులు కల్పించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమాన్ని తల్లిదండ్రులు సైతం స్వాగతించి పెద్ద ఎత్తున పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు చేర్పించడం ఆనందంగా ఉందని అన్నారు. ఉపాధ్యాయులు, ఎస్ఎం సి కమిటీ సభ్యులు ఇంకా పెద్దఎత్తున తల్లిదండ్రులను ప్రోత్సహించాలని సూచించారు.

Updated Date - 2022-06-29T21:46:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising