ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: Kishan reddy

ABN, First Publish Date - 2022-04-25T18:23:11+05:30

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో 3 జిల్లాలను వెనుకబడ్డ జిల్లాలుగా కేంద్రం గుర్తించిందని తెలిపారు. భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాలను ఆస్పిరేషన్ జిల్లాలుగా గుర్తించామన్నారు. ఈ జిల్లాల్లో విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని చెప్పారు. ఆస్పిరేషన్ జిల్లాల్లో అభివృద్ధి పనులను కేంద్రం స్వయంగా పరిశీలిస్తోందన్నారు. ప్రపంచంలో కరోనా వారియర్స్‌ను గుర్తించిన ప్రభుత్వం బీజేపీ అని చెప్పుకొచ్చారు. త్వరలో 5-15 ఏళ్ల పిల్లలకు వాక్సిన్ అందిస్తామని వెల్లడించారు. కరోనా మళ్లీ విజృంభిస్తోందని, అందరూ విధిగా మాస్కులు ధరించాలని సూచించారు. కరోనా నాలుగవ దశ ప్రభావం లేకుండా కలిసికట్టుగా పోరాడుదామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. 


Updated Date - 2022-04-25T18:23:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising