ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bandi Sanjay: ఎలాంటి చర్చ జరగలేదు.. అది తప్పుడు ప్రచారం

ABN, First Publish Date - 2022-08-21T22:33:21+05:30

కేంద్రమంత్రి అమిత్‌ షా (Central Minister Amit Shah), రైతుల సమావేశంలో విద్యుత్‌ (Vidyut) సవరణ చట్టాల మీద ఎలాంటి చర్చ జరగలేదని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (Hyderabad): కేంద్రమంత్రి అమిత్‌ షా (Central Minister Amit Shah), రైతుల సమావేశంలో విద్యుత్‌ (Vidyut) సవరణ చట్టాల మీద ఎలాంటి చర్చ జరగలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bjp State Chief Bandi Sanjay) తెలిపారు. కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సేంద్రీయ వ్యవసాయం గురించే అమిత్‌షా మాట్లాడారని చెప్పారు. ఢిల్లీలో విద్యుత్‌ చట్టాలకు సీఎం కేసీఆర్‌ (Cm Kcr) మద్దతు తెలిపారని గుర్తు చేశారు.  సీఎం కేసీఆర్‌ ఢిల్లీ (Delhi)లో మద్దతు ఇచ్చి రాష్ట్రానికి వచ్చి మాట మార్చారని బండి సంజయ్‌ పేర్కొన్నారు. 


రైతులతో  అమిత్ షా  సమావేశం.. ఏం చర్చించారంటే..

కాగా కేంద్రమంత్రి అమిత్ షా మునుగోడు సభకు వెళ్లేందుకు ముందుగా హైదరాబాద్ వచ్చారు. అనంతరం ఆయన రైతులతో సమావేశం నిర్వహించారు. గో ఆధారిత సాగు చేయాలని రైతులకు అమిత్‌షా సూచనలు చేశారు. 150 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నానని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు కాకపోవడంపై అమిత్‌షా ఆరా తీశారు. వరి కొనుగోళ్ల వివాదంపైనా రైతులతో మాట్లాడారు. ఇన్‌పుట్ సబ్సిడీ అందడం లేదని అమిత్‌షాకు రైతులు వివరించారు. పీఎం కిసాన్ యోజన రూ.2వేల నుంచి రూ.5వేలకు పెంచాలని రైతులు, అమిత్‌షాను కోరారు.


అయితే విద్యుత్‌ (Vidyut) సవరణ చట్టాల మీద అమిత్ షా, రైతుల మధ్య చర్చ జరిగినట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై బండి సంజయ్ స్పందించారు. 


Updated Date - 2022-08-21T22:33:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising