ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

The Debate: ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీపై ఎలాంటి చర్చ జరుగుతోంది?

ABN, First Publish Date - 2022-08-23T01:22:19+05:30

నోవాటెల్‌ హోటల్‌లో కేంద్రమంత్రి అమిత్ షా (Central Minister Amit shah), జూనియర్ ఎన్టీఆర్ (Junior Ntr) కలిశారు. దాదాపు 45 నిమిషాలు వీరి మధ్య...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నోవాటెల్‌ హోటల్‌లో కేంద్రమంత్రి అమిత్ షా (Central Minister Amit shah), జూనియర్ ఎన్టీఆర్ (Junior Ntr) కలిశారు. దాదాపు 45 నిమిషాలు వీరి మధ్య మాటామంతి జరిగింది. దీంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే ‘త్రిబుల్‌ఆర్’ మూవీలో నటనపై విషెస్ తెలిపేందుకే జూనియర్ ఎన్టీఆర్‌ను అమిత్ షా పిలిచారని.. వీరి భేటీలో ఎలాంటి రాజకీయాలపై చర్చ జరగలేదని రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారు.


మరోవైపు లిక్కర్ స్కామ్‌లో సీఎం కేసీఆర్ కుటుంబంపై బీజేపీ ఎంపీ ఆరోపణలు చేశారు. దీంతో తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కింది. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు రావడంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 


అటు ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లడంపైనా పలు విమర్శలు వినిపిస్తున్నాయి. బాబాయ్ హత్య కేసుతో పాటు లిక్కర్ స్కామ్ పైనా బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరిపారనే ప్రచారం జరుగుతోంది. 



ఈ నేపథ్యంలో ‘ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీపై ఎలాంటి చర్చ జరుగుతోంది?. ఏమీ లేదని బీజేపీ అంటుంటే-ఏదో ఉందని వైసీపీ ఎందుకు ఉలిక్కిపడుతోంది?. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో టీఆర్ఎస్-వైసీపీ ఇరుక్కున్నాయా?. సారా కుంభకోణం మొత్తాన్ని బీజేపీ  నిగ్గు తేలుస్తుందా?. జగన్ ఢిల్లీ టూర్ ఎలాంటి సమస్యలను పరిష్కరించింది?. పోలవరం వంటి సమస్యలపై ప్రధానిని డిమాండ్ చేశారా?. బాబాయ్ హత్య కేసు, లిక్కర్ స్కామ్‌పై చర్చించారా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 



Updated Date - 2022-08-23T01:22:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising