ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొదటి నుంచి దేశమంతా ఒకే ధాన్యం సేకరణ విధానం వుంది

ABN, First Publish Date - 2022-04-12T01:43:17+05:30

దేశంలో మొదటి నుంచి ఒకే ధాన్యం సేకరణ విధానం అమలులో వుందని కేంద్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సుధంశు పాండే పేర్కొన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో మొదటి నుంచి ఒకే ధాన్యం సేకరణ విధానం అమలులో వుందని కేంద్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సుధంశు పాండే పేర్కొన్నారు.ధాన్యం సేకరణపై గతంలో రాష్ట్రాల వివరాలు కోరామని ఆయన తెలిపారు. ఇంకా సేకరించాల్సిన బియ్యం ఉన్నాయన్నది అవాస్తవమని అన్నారు. ముందుగా ఇచ్చిన వివరాల మేరకే ధాన్యం సేకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎంత అవసరం ఉందో అంతే ధాన్యం తీసుకుంటామని చెప్పారు.తెలంగాణలో గత ఐదేళ్లలో ఏడు రెట్ల ధాన్యం సేకరణ చేశామని తెలిపారు. ఖరీఫ్‌లో 68.7 ఎల్‌ఎంటీ ధాన్యం సేకరణ చేశామని సుధాంశు పాండే తెలిపారు. 


ఎఫ్‌సీఐ దగ్గర ఇప్పటికే 88.37 ఎల్‌ఎంటీ పారా బాయిల్డ్ రైస్‌ ఉందని ఆయన వెల్లడించారు.ఇందులో అత్యధికంగా తెలంగాణ నుంచే 40కి పైగా ఎల్‌ఎంటీ చేశామని చెప్పారు. విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఎలాంటి ఆటంకాలు లేవన్నారు.అన్ని రాష్ట్రాల నుంచి బాయిల్డ్‌ రైస్ సేకరణ తగ్గించామన్నారు.అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలో ధాన్యం సేకరిస్తామని ఆయన వెల్లడించారు. బాయిల్డ్‌ రైస్ ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం సంతకం పెట్టిందని ఆయన గుర్తు చేశారు.ధాన్యం సేకరణ, సంచుల అవసరంపై తెలంగాణ నుంచి ఎలాంటి ప్లాన్ అందలేదని అన్నారు. పంజాబ్ నుంచి పారా బాయిల్డ్‌ రైస్ తీసుకోలేదని సుధంశు పాండే స్పష్టం చేశారు. 

Updated Date - 2022-04-12T01:43:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising