ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో ఐదు గేదెల మృతి

ABN, First Publish Date - 2022-06-23T05:44:28+05:30

విద్యుదాఘాతంతో ఐదు గేదెల మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహదేవపూర్‌, జూన్‌ 22: వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్‌ తీగలు తగిలి ఐదు పాడి గేదెలు మృతి చెందిన సంఘటన మండలంలో బుధ వారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాళేశ్వరం పంచాయతీ పరిధి ఇప్పలబోరు వాసి యాదగిరి సతీష్‌కు చెందిన నాలుగు గేదెలు నాలుగు రోజుల క్రితం మేతకు వెళ్లి తిరిగి ఇంటికి చేరు కోలేదు. దీంతో సతీష్‌, అతడి కుటుంబ సభ్యులు  గేదెల జాడ కోసం వెతికారు. ఈ క్రమంలో పూసుపు పల్లి అటవీ ప్రాంతంలో వాటి కళేబరాలు బుధవారం కనిపించాయి.  వణ్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగల కారణంగా సతీష్‌కు చెందిన నాలుగు గేదెలతోపాటు గుర్తుతెలియని వ్యక్తికి చెందిన మరో గేదె మృతి చెంది ఉన్నాయి. గేదెల మృతితో తనకు సుమారు రూ. 2 లక్షల నష్టం వాటిల్లిందని సతీష్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు కాళేశ్వరం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.  

రోడ్డు ప్రమాదంలో రెండు..

కాటారం : ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో రెండు పాడి గేదె లు మృతి చెందిన సంఘటన మండల కేంద్రం శివారు లోని శ్మశాన వాటిక సమీపంలో జాతీయ రహదారి 353 (సీ)పై మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎర్రగుం టపల్లికి చెందిన అంకయ్య, రాజబాపు అనే రైతులకు చెందిన పాడి గేదెలు మేతకు వెళ్లి రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతి చెందిన పాడి గేదెల విలువ సుమారు రూ.80 వే లు ఉంటుందని అంకయ్య, రాజబాపు తెలిపారు.

Updated Date - 2022-06-23T05:44:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising